pavan kalyan og (image source :X)
ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan: ‘ఓజీ’ థియేట్రికల్ బిజినెస్… రికార్డులు బద్దలే!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘ఓజీ’పై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయని సినిమా వర్గాలు చెబుతున్నాయి. యాక్షన్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు మొదటి నుంచీ బజ్ కొనసాగుతుంది. విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు అభిమానుల అంచనాలు మించి ఉన్నాయి. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తియిందంటూ తెలిపిన నిర్మాతలు పవన్ కళ్యాణ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమా ప్రీ రిలీజ్ మర్కెట్‌ను అమాంతం పెంచేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ 169 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయని టాక్. అదే అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 200 కోట్ల రూపాయలకు లాక్ అవనుంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం మొత్తం బిజినెస్ 350 కోట్ల రూపాయలకు పైమాటే ఉండేలా తెలుస్తుంది. రికార్డు స్థాయిలో పవన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయని సామాచారంతో విడుదలకు ముందే పవన్ కళ్యాణ్ హిట్ కొట్టాడు అంటూ అభిమానులు సంబరపడిపోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నిర్మాతల నుంచి రావాల్సి ఉంది.

Also Read – YSRCP: ఇంటింటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసాలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఒక సినిమా వస్తుందంటే అభిమానులకు పండగ చేసుకుంటారు. అలాంటిది వరసగా రెండు చిత్రాలు విడుదల చేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు. ‘హరి హర వీరమల్లు’ జూలై 24న విడుదల కానుండగా… ‘ఓజీ సెప్టెంబర్ 25న విడుదల కానుంది. రెండు వరుస సినిమాలు రావడంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే రాజకీయాల్లో డిప్యూటీ సీఎంగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుని.. చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలు రావడంతో ఈ సారి బాక్సాఫీసు బద్దలవుతుందని అభిమానులు అంటున్నారు. 2023 వచ్చిన ‘బ్రో’ తర్వాత రెండు సంవత్సరాలు సినిమాలకు గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ కూడా విడుదలైతే‌ పై లెక్కలకు రెక్కలొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read –Student Missing: స్టూడెంట్ మిస్సింగ్‌ మిస్టరీ.. రూమ్‌లో దొరికిన లేఖలో..

ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ‘సాహో’ వంటి భారీ చిత్రాన్ని తెరకెక్కించిన సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తన మ్యూజిక్‌తో మ్యేజిక్ చేసి థియేటర్‌లో బాక్సులు బద్ధలుగొట్టే ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫర్లుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుల్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి తదితర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణం, నిర్మాణ విలువలు ఉండటంతో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ఖాయమంటూ సినీ పెద్దలు కితాబిస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!