MLC Kavitha: మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆమె సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, హరీశ్ రావు మీద ఆరోపణలు వస్తే ఆయన వివరణ ఇవ్వాలి తప్ప ప్రతిసారీ వందిమాగధులు తమ తరఫున మాట్లాడుతారంటే ప్రజాస్వామ్యంలో కుదరదన్నారు.
ప్రతిపక్షాల వైఫల్యం
ఆరోపణలు వచ్చిన వ్యక్తులు సమాధానం చెబుతారా లేదా అన్ని ప్రజలు గమనిస్తారన్నారు. పిల్లి మీద పిట్ట మీద పెట్టి వాళ్లతో వీళ్లతో తిట్టిస్తామంటే ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) గెలవటమనేది ప్రధాన ప్రతిపక్షాల వైఫల్యమేనని కవిత ఆరోపించారు. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వంటేజ్ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇతర పార్టీలు గెలిచిన సంఘటనలు కూడా ఉన్నాయి.
Also Read: Sheikh Hasina: షేక్ హసీనాకు మరణశిక్ష.. ఢాకా కోర్టు సంచలన తీర్పు
గ్రామాల్లోకి వెళితే..
కాంగ్రెస్ పార్టీ మీద చాలా వ్యతిరేకత ఉందని గ్రామాల్లోకి వెళితే ప్రజలు ఆ పార్టీని తిడుతున్నారన్నారు. అయినా కూడా కాంగ్రెస్ గెలిచిందంటే ప్రతిపక్షాలైన బీజేపీ(BJP), బీఆర్ఎస్(BRS) స్పష్టంగా విఫలమైందని అర్థం అవుతోందని దుయ్యబట్టారు. ప్రజల సమస్యలపై చేయాల్సినంత పోరాటం ఆ పార్టీలు చేయడం లేదని అందుకే ఆ బాధ్యతను తెలంగాణ జాగృతి తన భుజాన వేసుకుందన్నారు.
Also Read: Crime News: రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌లో పరువు హత్య కలకలం

