MLC Kavitha (imagecredit:twitter)
Politics, తెలంగాణ

MLC Kavitha: నేటి నుంచి ఎమ్మెల్సీ కవిత జాగృతి యాత్ర.. మొత్తం నాలుగు నెలల ప్లాన్ ఇదే!

MLC Kavitha: బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి యాత్రకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) శ్రీకారం చుట్టారు. ఈ నెల 25 నుంచి ‘జాగృతి జనం బాట’ యాత్ర స్టార్ట్ చేస్తున్నారు. యాత్రను తన సొంత జిల్లా నిజామాబాద్(Nizamabad) నుంచి ఆమె ప్రారంభించబోతున్నారు. స్వరాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, సబ్బండ వర్గాలకు అండగా నిలిచేందుకు తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాబోయే నాలుగు నెలల ప్రజల్లోనే ఉండనున్నారు. వారి కష్టాలు, సమస్యలను దగ్గరి నుంచి చూసి తెలుసుకొని నివేదిక రూపంలో తయారుచేయబోతున్నట్లు సమాచారం. సొంతబలం.. సొంతబలం(జాగృతి)తోనే యాత్ర చేపడుతున్నారు. ప్రజాదరణను పొందేందుకు సిద్ధమయ్యారు. రాజకీయ పార్టీలకు సైతం తన సత్తా చాటాలని కవిత భావిస్తున్నట్లు సమాచారం.

పరిష్కారమార్గాలేంటో..

తెలంగాణలో సామాజిక అంశాల అధ్యయన యాత్రగా ఈ పర్యటన సాగబోతుందని జాగృతి నేతలు తెలిపారు. బీఆర్ఎస్(BRS) కు రాజీనామా చేసిన తర్వాత ఆమె కొత్త పార్టీ పెడతారని చాలా మంది భావించారు. కానీ కవిత మాత్రం తెలంగాణ(Telangana) ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకున్నాకే రాజకీయంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. అందుకే తాను ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అందుకే కవిత ‘ జాగృతి జనం బాట’ పడుతున్నారు.

ఒకరిద్దరితో ఒకటి రెండు రోజులు మాట్లాడితే తెలంగాణ ఏం కోరుకుంటుందో తెలియదని భావించిన ఆమె.. అన్ని వర్గాలను కలవాలని, వారి సమస్యలు.. పరిష్కారమార్గాలేంటో తెలుసుకోవాలని, అప్పుడు మాత్రమే స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. యాత్రలో భాగంగా రైతులు, మహిళలు, కార్మికులు, యువత, మేధావులు, కుల సంఘాలు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, అమర వీరుల కుటుంబాలు ఇలా ప్రతి ఒక్కరినీ తన ‘జనంబాట’ లో భాగస్వాములను చేయబోతున్నారు. ఒక్కటి, రెండు ప్రాంతాలని కాకుండా మొత్తం తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ప్రజల సాధక బాధలు తెలుసుకోనున్నారు. అన్ని వర్గాల వారితో మాట్లాడిన తర్వాతనే తెలంగాణ ఆకాంక్షలేంటన్నది ఒక క్లారిటీ వస్తుందని ఆమె భావిస్తున్నారు. అంటే మొత్తం తెలంగాణనే సమగ్ర అధ్యయనం చేయనున్నారు.

Also Read: Nepotism: నెపోటిజం అంటే ఏమిటి?.. టాలీవుడ్‌లో అది ఎంతవరకూ ఉందంటే?

19 ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్నా..

ఈ నెల 25 నుంచి ప్రారంభమవుతున్న యాత్ర.. 33 జిల్లాల్లో కొనసాగనుంది. నాలుగు నెలల పాటు సాగుతుందని, వారానికి నాలుగు రోజులు.. ప్రతి జిల్లాల్లో రెండు రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. వచ్చే ఏడాది 13వరకు యాత్ర కొనసాగేందుకు జాగృతి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. తాను తెలంగాణ సోయి, కన్ సర్న్ ను ఉన్న వ్యక్తినని.. అందుకే పేగులు తెగేదాక తెలంగాణ కోసం కొట్లడానని..19 ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్నానని, ఈ ప్రాంతం, సంస్కృతి, సంప్రదాయాల విశిష్టత ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఉద్యమం సమయంలోనే తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించినట్లు ఇప్పటికే కవిత ప్రకటించారు. తెలంగాణలో అన్ని వర్గాలకు మేలు జరగాలన్నదే తన బలమైన ఆకాంక్ష అన్నారు. బీఆర్ఎస్ లో ఉండి కూడా తాను ఇదే విషయాన్ని చెప్పేదాన్ని అని, అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా సామాజిక తెలంగాణ సాధించేందుకే తాను జనం బాట పడుతున్నట్లు స్పష్టం చేశారు.

తెలంగాణ గోస వినే పార్టీ..

కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ ప్రాంతం మీద ప్రేమ, మమకారం లేవు అని ఫక్తు రాజకీయ ప్రయోజనాలు మాత్రమేనని ఇప్పటికే కవిత ఆరోపణలకు ఎక్కుపెట్టింది. మనది అనుకున్న బీఆర్ఎస్ కూడా తెలంగాణ ప్రజలు కోరుకున్న దారిలో ముందుకు సాగలేదని విమర్శనాస్త్రాలు సంధించింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ మళ్లీ ఒంటరి అయ్యిందని, ఇప్పుడు తెలంగాణ గోస వినే పార్టీ లేకుండా పోయిందని. అసలు సాధించుకున్న తెలంగాణలో ప్రజలు ఏం కోరుకుంటున్నారన్న దానిపై ఇప్పుడున్న ఒక్క పార్టీ కూడా దృష్టి పెట్టటం లేదని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తుంది. గతంలో తెలంగాణ ప్రాంతం మీద ఏ విధంగా వివక్ష కొనసాగిందో… ఇప్పుడు అదే విధంగా కొన్ని వర్గాల పై వివక్ష కొనసాగుతోందని, అలాంటి వివక్ష లేకుండా సామాజిక తెలంగాణ కావాలని బీఆర్ఎస్ లో కొనసాగేటప్పుడే నినాదం అందుకున్నారు. అన్ని వర్గాలకు రాజకీయంగా అవకాశాలు అందివచ్చినప్పుడే ఆయా వర్గాలు బాగుపడతాయని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. 20 ఏళ్లుగా తెలంగాణ సమాజంతో కలిసి నడిచిన తనకు ఈ ప్రాంతం సాధక బాధకాలు తెలుసు అని, తెలంగాణ ప్రజల గొంతుక అనేది లేకపోతే గతంలో ఎలా నష్టపోయమన్నది కూడా తెలుసు అని, అందుకే తెలంగాణ గొంతుక కావాలని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుతున్నారు.

Also Read: Upasana: ట్విన్స్‌కు జన్మనివ్వబోతున్న ఉపాసన.. అందుకే ఈ డబుల్ సెలబ్రేషన్!

జాగృతి లో కేసీఆర్ ఫొటో..

కేసీఆర్(KCR) ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని.. అలాంటప్పుడు ఆయన ఫొటోతో జనంలోకి వెళ్లడం నైతికంగా కరెక్ట్ కాదని తెలంగాణ జాగృతి మొదలు పెట్టినప్పుడు కేవలం జయశంకర్(Jayashankar) ఫొటో మాత్రమే పెట్టమని, బీఆర్ఎస్(BRS) అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే జాగృతి లో కేసీఆర్ ఫొటో పెట్టినట్లు ప్రకటించారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు రాజీనామా చేశానని, అందుకే ఆయన జనంబాట యాత్ర వాల్ పోస్టర్లలో సైతం కేవలం తెలంగాణ తల్లి, పొప్రెసర్ జయశంకర్ ఫొటోలు మాత్రం పెట్టారు. ఆ ఫొటోలతోనే రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేపడుతున్నట్లు జాగృతి నేతలు తెలిపారు.

యాత్ర రూట్ మ్యాప్:

ఈ నెల 25న జాగృతి జనంబాట యాత్ర నిజామాబాద్ లో ప్రారంభం అవుతుంది. 26న సైతం కొనసాగుతుంది. మహబూబ్ నగర్ 28,29తేదీల్లో, కరీంనగర్ లో ఈ నెల 31, నవంబర్ 1న, ఆదిలాబాద్ లో 3, 4 తేదీల్లో, హన్మకొండ, వరంగల్ లో 8, 9 తేదీల్లో, నల్లగొండ 11, 12 తేదీల్లో, మెదక్ లో 14, 15 తేదీల్లో, ఖమ్మం 17, 18 తేదీల్లో, రంగారెడ్డిలో 20, 21 తేదీల్లో, నారాయణపేటలో 23, 24 తేదీల్లో, కామారెడ్డిలో 27, 28 తేదీల్లో, గద్వాలలో నవంబర్ 30, డిసెంబర్ 1, పెద్దపల్లిలో 3, 4 తేదీల్లో, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6, 7 తేదీల్లో, భూపాలపల్లిలో 9,10 తేదీల్లో, మంచిర్యాలలో 12, 13 తేదీల్లో, సిద్దిపేటలో 15, 16 తేదీల్లో, కొత్తగూడెంలో 18,19 తేదీల్లో, మేడ్చల్ లో 21, 22 తేదీల్లో, నాగర్ కర్నూల్ జిల్లాలో 27,28 తేదీల్లో, సిరిసిల్లలో జనవరి 3,4 తేదీల్లో, సూర్యాపేటలో 6,7 తేదీల్లో, జనగాంలో 10,11 తేదీల్లో, ఆసిఫాబాద్ లో 17, 18 తేదీల్లో, సంగారెడ్డిలో 20, 21 తేదీల్లో, వికారాబాద్ లో 24, 25 తేదీల్లో, ములుగులో 27, 28 తేదీల్లో, జగిత్యాలలో 30, 31 తేదీల్లో, మహబూబాబాద్ లో ఫిబ్రవరి 2, 3 తేదీల్లో, నిర్మల్ లో 5,6 తేదీల్లో, వనపర్తి జిల్లాలో 8,9 తేదీల్లో, హైదరాబాద్ లో 12,13 తేదీల్లో కొనసాగుతుంది.  ఫిబ్రవరి 13న ఎల్బీనగర్ స్టేడియంలో ‘జాగృతి జనం బాట’ ముగింపు సభను నిర్వహించనున్నారు.

Also Read: Jubilee Hills By Election: పొలిటికల్ హీట్.. జూబ్లీహిల్స్ ప్రచారంపైనే వాళ్ళ స్పెషల్ ఫోకస్

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్