Kavitha: ఘనపూర్ ప్రాజక్టు ఎత్తు పెంపు పనులు అప్పటి ప్రభుత్వం పూర్తి చేయలేదు, ఇప్పటి ప్రభుత్వమైన పనులు వెంటనే పూర్తి చేయించాలని ఇక్కడి ప్రజాప్రతినిధి ,(ఎమ్మెల్యే రోహిత్ పేరు) తీయకుండానే పరోక్షంగా ఎమ్మెల్యే రోహిత్ రావు ను డిమాండ్ చేశారు. జాగృతి జనం బాటలో బాగంగా మెదక్ జిల్లాలో నీ,నర్సాపూర్,మెదక్ నియోజక వర్గంలో జాగృతి వ్యవస్థాప అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు.
Also Read: MLC Kavitha: హైర్ బస్సు డ్రైవింగ్ ఆర్టీసీ సిబ్బందికి ఇవ్వాలి:ఎమ్మెల్సీ కవిత
ప్రభుత్వాల నిర్లక్ష్యం
నర్సాపూర్ నియోజక వర్గంలో రెడ్డి పల్లి గ్రామ శివారులో కాళేశ్వరం ప్రాజెక్టు 18 వ ప్యాకేజీ లో ఆగిపోయిన పనులను పరిశీలించి, అక్కడే రైతులతో కల్వకుంట్ల కవితమాట్లాడారు. అప్పటి,ఇప్పటి,ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పనులు ఆగిపోయాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి,కాళేశ్వరం 18 వ ప్యాకేజీ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.భూములు కోల్పోయిన రైతులకు నష్ట పరియారం అందించాలని డిమాండ్ చేశారు. రెడ్డిపల్లి వద్ద రింగ్ రోడ్డు పనులు పెద్దల భూములు కాపాడేందుకే సర్వే నిర్వహిస్తున్నారని కవిత మండిపడ్డారు. ఈ సందర్భంగా రెడ్డి పల్లి గ్రామ బస్ స్టాండ్ వద్ద రైతులతో సమావేశం అయ్యారు. భూములు కోల్పోయిన రైతుల సమస్యలు ఓపిగ్గా కవిత విన్నారు.
ఘనపూర్ ప్రాజక్టు ఎత్తు పెంపు పనులు వెంటనే ప్రారంభించాలి
ఘనపూర్ ప్రాజక్టు ను కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఘనపూర్ ప్రాజక్టు ఎత్తు పెంపు పనులు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరోక్షంగా ఎమ్మెల్యే రోహిత్ రావు పేరు ఎత్తకుండా ఇక్కడి ప్రజాప్రతినిధి, చొరవ తీసుకుని ప్రాజక్టు ఎత్తు పెంపు పనులు పూర్తి చేయించాలని కవిత డిమాండ్ చేశారు. అప్పటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం కూడా ఘనపూర్ ప్రాజక్టు ఎత్తు పెంపు పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. అంతకు ముందు,ఎస్టీ గురుకుల పాఠశాల లో విద్యార్థిని, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కౌడిపల్లి గురు కుల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడారు. కూల్చారం మళ్లీనాత సూరిని గొప్పతనాన్ని వర్ణించారు.
కేసీఆర్ శోభమ్మ పేర్లపై గుడిలో అర్చన
ఏడుపాయల దుర్గామాత ఆలయం లో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లిదండ్రులు అయిన బీఆర్ ఎస్‌పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్, శోభమ్మ ల పేర్ల తో పాటు అత్త , మామలు, కుటుంబ సభ్యుల పేర్లపై గర్భగుడిలో అర్చన చేయించారు. దుర్గమ్మకు ఒడిబియ్యం, సమర్పించారు. మెదక్ చర్చిలో కవిత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమె వెంట జాగృతి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. కవిత మెదక్ కు చేరుకోగానే చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. డప్పు చప్పుళ్ళతో,రాందాస్ చౌరస్తా నుంచి చర్చి వరకు జాగృతి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు.
Also Read: MLC Kavitha: బీఆర్ఎస్ పార్టీ పై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు.. నాకు సంబంధం లేదు అంటూ..!
