Kavitha: నైనీ టెండర్లు రద్దు చేసినట్లే ఎండీఓ విధానాన్ని రద్దు
Kavitha (image credit: twitter)
Political News

Kavitha: బీఆర్ఎస్‌లో ఉంటూ కేసీఆర్‌కు ద్రోహం చేస్తున్నారు.. కవిత కీలక వ్యాఖ్యలు!

Kavitha: సింగరేణిలో మేఘా కృష్ణారెడ్డికి రూ.25 వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నదని దానిమీద బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. గతంలో సృజన్ రెడ్డికి బీఆర్ఎస్ హయాంలోనే కాంట్రాక్ట్‌లు ఇచ్చారని, అప్పుడు రేవంత్ రెడ్డి బావమరది అని గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ డొల్లతనాన్ని తాము గమనిస్తున్నామన్నారు. గుంటనక్క ప్రెస్ మీట్‌ను గుడ్డిగా ఫాలో అయి కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. మొత్తానికి నైనీ కాంట్రాక్ట్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని, అయితే ఇక్కడ విచిత్రాలు జరగుతున్నాయని అన్నారు. తాము కాంట్రాక్టర్ల పక్షాన కాకుండా కార్మికుల పక్షాన మాట్లాడుతామని చెప్పారు. రెండేళ్లుగా కార్మికుల సమస్యల గురించి ఎన్నిసార్లు మాట్లాడినా భట్టి స్పందించడం లేదని ఆరోపించారు. కార్మికులకు వంద అన్యాయాలు జరిగినా సరే బీఆర్ఎస్ కూడా మాట్లాడలేదని అన్నారు. కానీ ఒక కాంట్రాక్టర్‌కు అన్యాయం జరిగితే ముందుకు వస్తున్నారని మండిపడ్డారు. 2015లో నైనీ ముందుగా అలాట్ అయ్యిందని, 2021లో అదానీ 44 శాతం ఎక్సెస్‌గా టెండర్ వేస్తే ఆయనకు ఇవ్వలేదని గుర్తు చేశారు. మధ్యలో సింగరేణి వేరే కంపెనీ వాళ్లకు మట్టి తీసే టెండర్ ఇచ్చిందని, దానికి డిజీల్ ఖర్చులతో సహా ఇచ్చారని, కానీ గుంటనక్క అబద్ధం చెప్పారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ హయాంలోరూ.25 వేల కోట్ల అప్పు

కేటీఆర్ ఏ విషయమైనా అధ్యయనం చేసి మాట్లాడుతారని అనుకునేదాన్నని కానీ ఆయన మాట్లాడుతుంటే దారుణం అనిపించిందని కవిత పేర్కొన్నారు. సైట్ విజిట్ అనే నిబంధన సింగరేణిలో గతంలో కన్వెయర్ బెల్ట్ లాంటి వాటికి ఉండేదని, ఇప్పుడు ఓబీకి కూడా పెట్టారని అన్నారు. దీన్ని ఎక్స్‌పోజ్ చేయడం మంచిదే కానీ బీఆర్ఎస్ హయాంలో అసలు ఎక్సెస్‌గా టెండర్లు పోలేదని అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. సృజన్ రెడ్డికి వచ్చింది కేవలం రూ.250 కోట్ల కాంట్రాక్ట్ మాత్రమేనని, అతను సీఎం బావమరిది అని పెద్దగా చేసి చూపెట్టి రూ.25 వేల కోట్ల కాంట్రాక్ట్ చేపట్టే మేఘా కృష్ణారెడ్డి గురించి మాట్లాడడం లేదన్నారు. సైట్ విజట్ నిబంధన కారణంగా కొంతమందికి అవకాశాలు దెబ్బతింటాయి కానీ గుంటనక్క చెప్పని విషయమేంటంటే సాయిల్ ఎక్స్‌వేషన్ పేరుతో మేఘా కృష్ణారెడ్డి సంస్థ అనుభవం ఉన్నదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తద్వారా రూ.25 వేల కోట్ల కాంట్రాక్ట్‌ను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హరీశ్ రావు మొత్తం దళిత కమ్యూనిటీనే అవమానపరిచే విధంగా భట్టి విక్రమార్కకు లేఖ రాయను అంటున్నారన్నారు. ‘‘కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మాత్రమే ఆయన లెటర్ రాస్తారంట, అసలు సింగరేణిలో ఎండీవో అనే సిస్టమ్ పెట్టారు. అది ఉండకూడదు. గతంలో సింగరేణికి ఓపెన్ కాస్ట్‌లతో ఎంతో లాభం ఉండేది. కానీ ఎండీవో సిస్టమ్ తెచ్చి సంస్థకు నష్టం చేస్తున్నారు. దీంతో అసలే నష్టాల్లో ఉన్న సింగరేణి మరింత నష్టపోతున్నది. బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణికి రూ.25 వేల కోట్ల అప్పు అయింది. కాంగ్రెస్ వచ్చాక రూ.50 వేల కోట్లు అయ్యింది. పవర్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. దీంతో సింగరేణి సంస్థ జీతాల కోసం కూడా అప్పు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది’’ అని వివరించారు.

Also Read: Kavitha Vs Mahesh Goud: జాగృతిలో మంచి పోస్ట్ ఇస్తాం.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కి కవిత ఆఫర్

బీఆర్ఎస్ నేతలు నిజాలే చెప్పాలి

నైనీ టెండర్లు రద్దు చేసినట్లే ఎండీవో విధానాన్ని రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. మనం కూడా నైనీ బ్లాక్ ఉన్న ఒడిశాకు వెళ్లి ఓపెన్ కాస్ట్ చేయాలని, దాని ద్వారా తెలంగాణ కార్మికులకు ఉద్యోగాలు వస్తాయని సూచించారు. తద్వారా సంస్థకు మేలు జరుగుతుందన్నారు. ఎంతో క్వాలిటీ ఉన్న తాడిచర్ల బ్లాక్‌ను కూడా ఎండీవో విధానం ద్వారా ఇచ్చారని, దీంతో సంస్థకు లీజు మాత్రమే వస్తుందని తెలిపారు. గ్రేడ్ 9 క్వాలిటీ ఉన్న కోల్‌ను పెద్ద చేప కోసం కాంట్రాక్ట్ ఇస్తున్నారని, సింగరేణి విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న డొల్ల విధానాన్ని తాము గమనిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అబద్ధాలు చెప్పకుండా ప్రజలకు అన్నీ వాస్తవాలే చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

హరీశ్ చెప్పగానే కిషన్ రెడ్డి కమిటీ వేయడం ఏంటి?

‘‘అసలు రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా సీబీఐ వస్తుందా? గుంటనక్క మాత్రం భట్టికి లేఖ రాయకుండా కిషన్ రెడ్డికి రాస్తారంట. ఆయన అడగగానే కిషన్ రెడ్డి ఏదో కమిటీ వేశారు. అందులో ఏజీఎం ర్యాంక్ ఉన్న మారుపల్లి వెంకటేష్ అనే అధికారి ఉన్నారు. ఆయన సింగరేణి ఎండీని ప్రశ్నించి ఆయనకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇవ్వగలరా? అసలు ఏపీలో, తెలంగాణలో ఉన్న కొత్త బ్లాక్‌లను సింగరేణికే ఇవ్వాలి. కిషన్ రెడ్డి ఈ బ్లాక్‌ సింగరేణికి వచ్చేలా కృషి చేయాలి. రూల్స్ అనకుండా మనకు వచ్చేందుకు ఆయన తరఫున ప్రయత్నం చేయాలి. గతంలో గుజరాత్‌కు బొగ్గు బ్లాక్‌లను తీసుకొని పోయిన ఘటనలు లేవా? కిషన్ రెడ్డి తెలంగాణ కోసం చేయకపోతే బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చి ఏం లాభం. తర్వలోనే సింగరేణిలో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికైనా కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కార్మికుల రిక్రూట్‌మెంట్లు, బిల్లులు వచ్చేలా చేయాలి. మాకు మైనార్టీ వాటా ఉన్నదంటూ ఏమీ చేయలేమని కిషన్ రెడ్డి చెప్పడం కరెక్ట్ కాదు. జాగృతి తరఫున నైనీ బ్లాక్‌ను విజిట్ చేసేందుకు ప్రత్యేక డెలిగేషన్ వెళ్తుంది’’ అని కవిత తెలిపారు.

బీఆర్ఎస్‌లోనే ఉంటూ కేసీఆర్‌కు ద్రోహం

కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎవరైనా కార్మికుల పక్షాన ఉండాలని కవిత సూచించారు. అలా కాకుండా కాంట్రాక్టర్ల కోసం పని చేయడం కరెక్ట్ కాదన్నారు. జాగృతి మాత్రం ఎప్పటికీ కూడా కార్మికుల పక్షానే ఉంటుందని, వారి కోసం పని చేస్తుందని చెప్పారు. సింగరేణిలో కాంగ్రెస్ వాటాలు తేలలేదని గుంటనక్క అంటున్నారని, కానీ అసలు గుంటనక్క వాటాలు తేలకపోవడంతోనే అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పైగా ఆయన 2014 నుంచి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారని, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పైనే విచారణ చేయమని అడుగుతున్నారన్నారు. పాపం కేటీఆర్ కూడా అదే ట్రాప్‌లో పడి అదే విధంగా డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లోనే ఉంటూ కేసీఆర్‌కు గుంటనక్క ద్రోహం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్‌కు వస్తానంటే మహేశ్ కుమార్ గౌడ్ వద్దన్నానంటూ చెబుతున్నారని, అసలు కాంగ్రెస్ తెలంగాణలో లూజింగ్ పార్టీ అని, వచ్చే ఎన్నికల్లో జాగృతి పార్టీకి ప్రజలు పట్టం కడతారని స్పష్టం చేశారు. తాము ధూంధాంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామని చెప్పారు. మహేశ్ గౌడ్‌కే తాము ఆఫర్ ఇస్తున్నామని, ఆయనకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మా పార్టీలోకి వస్తే నేషనల్ కన్వీనర్ పదవి ఇస్తామని తెలిపారు. తన వ్యక్తిత్వాన్ని బద్నాం చేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ జోక్ అయిపోయిందని, రెండేళ్లుగా సీరియల్‌గా సాగదీస్తున్నారని కవిత అన్నారు.

Also Read: Kavitha Vs Mahesh Goud: జాగృతిలో మంచి పోస్ట్ ఇస్తాం.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కి కవిత ఆఫర్

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?