Kavitha (IAMGE credit: swtcha reporter)
Politics, లేటెస్ట్ న్యూస్

Kavitha: టీబీజీకేఎస్ కు గెలిచే సీన్ లేదు… కవిత సంచలన కామెంట్స్!

Kavitha: సింగరేణిలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడుతున్నారు.. ప్రతి కాంట్రాక్ట్ లో 25 శాతం అవినీతి జరుగుతోంది.. 10 శాతం వాటా కాంగ్రెస్ పెద్దలకు వెళ్తోంది.. ఈ అవినీతిని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించం.. అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, సీఎంలను డిమాండ్ చేస్తున్నాం.. ప్రభుత్వం స్పందించకుంటే మేమే సీబీఐకి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) హెచ్చరించారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో హెచ్ఎంఎస్ – సింగరేణి జాగృతి సంయుక్త సమావేశం(ఏబీ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కేంద్ర కార్యవర్గ సమావేశం) నిర్వహించారు.

Also Read: Woman Kills Husband: ఇదెక్కడి విడ్డూరం.. భర్తను దారుణంగా చంపి.. నేరం పులి మీదకు తోసిన భార్య

సింగరేణి భవన్ ను ముట్టడిస్తాం 

హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలిగా ఎన్నికైన కవిత ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. సింగరేణిలో జరుగుతోన్న అవినీతికి వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే జరగబోయే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికుల విశ్వాసం పొంది హెచ్ఎంఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్మికుల హక్కుల కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. టీబీజీకేఎస్ అనేది మొన్న ఎన్నికల్లో పోటీనే చేయలేదని, గుర్తింపు సంఘం అనుకుంటున్న వాళ్లు వాపును చూసి బలుపు అనుకుంటున్నారని, నిజానికి సింగరేణి ఎన్నికల్లో వాళ్లకు గెలిచే అంతా సీన్ లేదన్నారు. అప్పుడు ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ కారణంగా ఆ పరిస్థితి వచ్చిందని వెల్లడించారు. సింగరేణిలో ఇప్పుడున్న ఎర్రజెండా కాకుండా మరొక జెండా ముందుకు రాబోతోందని, హెచ్ఎంఎస్, జాగృతి సంస్థలు మొత్తం 40 వేల మంది సింగరేణి కార్మికుల కోసం పనిచేస్తాయన్నారు. కార్మిక చట్టాలన్నీ అమలయ్యేలా మనం పోరాటం చేద్దామని పిలుపు నిచ్చారు.

టీబీజీకేఎస్ నాయకులు ఎందుకు పోరాటం చేయటం లేదు 

గతంలో కేసీఆర్ చెప్పారనే టీబీజీకేఎస్ కు ఓటు వేశారని, సంఘం గౌరవాధ్యక్షురాలిగా నేను కార్మికుల సమస్యలపై స్టడీ చేసి కేసీఆర్ తో మాట్లాడి వాటిని పరిష్కరించానన్నారు. కేసీఆర్ ఇప్పుడు అధికారంలో లేరు.. సింగరేణిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఇప్పుడున్న టీబీజీకేఎస్ నాయకులు ఎందుకు పోరాటం చేయటం లేదో కార్మికులకు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిక్షణం కార్మికుల కోసం ఫీల్డ్ లో ఉండి పనిచేసే వారే కార్మిక సంఘం గెలుస్తారన్నారు. టీబీజీకేఎస్ నాయకులు అవినీతి చేయొద్దని గతంలో నేను ఎన్నోసార్లు చెప్పాను.. అయినా నాయకులు స్వార్థంతో అవినీతి చేశారన్నారు. కార్మిక సంఘాల్లో యువతను ప్రోత్సహించాలని కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 42 వేల కోట్ల బకాయిలు

కేసీఆర్ సింగరేణి సంస్థను కన్నబిడ్డలా చూసుకున్నారు.. వారి మార్గంలోనే హెచ్ఎంఎస్ కూడా పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వారి తీరుకు వ్యతిరేకంగా కొట్లాడుదాం అన్నారు. సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలను తగ్గించేందుకు కొత్త కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న మైన్స్, మినరల్స్ ను వినియోగించుకొని ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించాలన్నారు. సింగరేణి ప్రాంత ప్రజలకు దక్కాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నారన్నారు. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు కాంగ్రెస్ ప్రభుత్వం 42 వేల కోట్ల బకాయిలు పెట్టి నష్టాల్లోకి నెట్టేస్తోందని, ఇలా చేస్తే సంస్థ భవిష్యత్ ఏం కావాలి? అని ప్రశ్నించారు. సింగరేణి ఎన్నికల్లో గెలవబోయేది మనమేనని, మహిళ కార్మికుల సంక్షేమం, వారి వసతుల కోసం కూడా పోరాటం చేద్దామన్నారు. హెచ్ఎంఎస్ లో సభ్వత్యాలు పెంచాలని, ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ కూడా నిర్వహిద్దామన్నారు. హెచ్ఎంఎస్, జాగృతి రెండు కళ్లలా పనిచేస్తాయని తెలిపారు. హెచ్ఎంఎస్, జాగృతి కొత్త కాంబినేషన్.. అదే విన్నింగ్ కాంబినేషన్ కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

 Also Read: Lawyers Fight: హైకోర్టులో షాకింగ్ ఘటన.. జడ్జి ముందే గొడవ పడ్డ లాయర్లు.. వీడియో వైరల్

Just In

01

Disha Patani: ఇంటి ముందు కాల్పులు.. షాక్‌లో దిశా పటానీ.. విషయం ఏమిటంటే?

Ambedkar University: అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు పొడిగింపు

New Train Service: అందుబాటులోకి కొత్త రైల్వే లైన్.. పచ్చజెండా ఊపనున్న ప్రధాని మోదీ

Anupama Parameswaran: థియేటర్లలోకి ‘కిష్కింధపురి’.. సైలెంట్‌గా ఓటీటీలోకి మరో సినిమా!

Hyderabad Crime News: రేణు అగర్వాల్ హత్య కేసులో.. కీలక ఆధారాలు వేలుగులోకి?.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!