Kavitha: తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అందుకు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. త్వరలోనే జిల్లాల పర్యటనలు చేయాలని భావిస్తుంది. దక్షిణ తెలంగాణ నుంచి ప్రారంభించాలా? లేక ఉత్తర తెలంగాణ నుంచి పర్యటనలకు శ్రీకారం చుట్టాలా? ఏ జిల్లా నుంచి ప్రారంభిస్తే కలిసి వస్తుందనే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే జిల్లాల టూర్ తేదీలను సైతం ప్రకటించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read: Local Body Elections: ఆ గ్రామపంచాయతీలకు ఎన్నికలు లేవు.. తేల్చిచెప్పిన ఎన్నికల కమిషనర్
భవిష్యత్ కార్యాచరణను సైతం సిద్ధం
కవిత స్పీడ్ పెంచబోతుంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. అన్ని వర్గాల ప్రజలను కలిసి వారితో మమేకం కావాలని భావిస్తుంది. యువత, విద్యార్థులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, కవులు, రచయితలు, కళాకారులు, మాస్ పీపుల్స్, మేధావులతో భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లాల్లో ఎవరితో సమావేశం కావాలనేది ప్లాన్ చేస్తున్నారు. అందరి అభిప్రాయాలను స్వీకరించిన తర్వాతనే ప్రజాసమస్యలపై ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు జాగృతి నేతలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణను సైతం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. జిల్లాల పర్యటనలో భాగంగా 23 కొత్త జిల్లాలు పర్యటించాలని అందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏ జిల్లా నుంచి పర్యటించాలనేది త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే ఏ జిల్లా నుంచి జిల్లాల పర్యటనను ప్రారంభించాలనేదానిపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
18 జిల్లాలకు జాగృతి కమిటీలను కంప్లీట్
తెలంగాణ జాగృతిని పటిష్టం చేసే పనిలో ఇప్పటికే కవిత నిమగ్నం అయ్యారు. సుమారు 18 జిల్లాలకు జాగృతి కమిటీలను కంప్లీట్ చేశారు. అయితే జిల్లా అధ్యక్షుడితో పాటు అనుబంధ సంఘాలకు అధ్యక్షులను ప్రకటించారు. పూర్తిస్థాయి కమిటీలను ప్రకటించలేదు. అయితే జిల్లాల పర్యటన తర్వాత యాక్టీవ్ నేతలను సైతం గుర్తించి వారికి పదవులు అప్పగించబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా పెండింగ్ లో ఉన్న మరో 15 జిల్లాకు సైతం మూడో విడుతల కమిటీల ప్రకటనపైనా కసరత్తు చేస్తున్నారు. యాక్టీవ్ గా పనిచేసేవారికే కమిటీల బాధ్యతలను అప్పగించడంతో పాటు బడుగు, బలహీన వర్గాల నేతలకే కీలక పదవులు అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన కమిటీల్లోనూ 80శాతం వారిపై అప్పగించి జాగృతి బడుగు, బలహీన వర్గాల పక్షమని కవిత (Kavitha) ప్రకటించారు.
కేడర్ ను సన్నద్ధంచేయాలి
రాష్ట్రంలోని రాజకీయపక్షాలను సైతం ఇరుకునబెట్టేలా కవిత ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగానే జాగృతి కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు అప్పగిస్తూ ఆయా పార్టీలు సైతం ప్రకటించే కమిటీల్లో స్థానం కల్పించేలా ఒత్తిడిని పెంచుతున్నారు. 42శాతం రిజర్వేషన్లపై ఇప్పటికే పోరాటబాటపట్టిన కవిత.. ఆదిశగానే ప్రభుత్వంపై సైతం ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతుంది. అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తుంది.
అందులో బాగంగానే జిల్లాల పర్యటనలోనూ బీసీ రిజర్వేషన్లు, స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా గళం ఎత్తాలని భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే చేసే జిల్లాల పర్యటనలతో జాగృతిని బలోపేతం చేయాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి సంస్థాగతంగా కేడర్ ను సన్నద్ధంచేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు, స్థానిక సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నట్లు జాగృతి నేతలు తెలిపారు.
Also Read: Vijay Rashmika: సన్నిహితుల మధ్య సీక్రెట్‌గా రష్మిక, విజయ్ దేవరకొండల నిశ్చితార్థం
