Kavitha on Leadership: మన ఆలోచనే ఆయుధం కావాలి” అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) స్పష్టం చేశారు. సాంస్కృతిక నేపథ్యం లేకుండా ఏ జాతి కూడా మనుగడ సాధించలేదని, తెలంగాణ జాతికి అద్భుతమైన సాంస్కృతిక నేపథ్యం ఉందని, దాన్ని పరిరక్షించడమే తమ ఆలోచనగా తెలంగాణ జాగృతి (Telangana Jagruti) పని చేస్తూ వచ్చిందని ఆమె వెల్లడించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్(Hyderabad)లో ‘లీడర్’ పేరిట నిర్వహించిన రాజకీయ శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.
Also Read: Real Estate Scam: జనం నుంచి కోట్లలో డబ్బు వసూళ్లు.. నిలువునా మోసపోయిన 250 మంది
తెలంగాణ జాగృతి(Telangana Jagruti) సంస్థ తెలంగాణలో చురుకైన నాయకత్వాన్ని తీర్చిదిద్దుతుందని, రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని పెంపొందించాలనుకుంటున్నామని కవిత(Kavitha) అన్నారు. “నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడవుతాడు” అని పేర్కొన్నారు. “పక్కోన్ని తిట్టడం ట్రెండ్‌గా మారింది. తిట్లు తిడుతున్నారంటే కంటెంట్ లేదని అర్థం” అని వ్యాఖ్యానించారు. కాలానికి అనుగుణంగా తెలంగాణ జాగృతి తన పంథాను మార్చుకుందని, ఎప్పుడు కూడా కొత్తగా, నవీనంగా ఉంటేనే సంస్థలు నిలబడతాయని ఆమె వివరించారు. లీడర్ అంటే కేవలం సర్పంచ్, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం మాత్రమే కాదని, ఈ సమాజంలో తొలి లీడర్ ఇంట్లోని ఇల్లాలు అని తెలిపారు.
అసలు భయపడేది లేదు..
“లీడర్ అంటే ఎవరో ఆకాశం నుంచి ఊడిపడరు. తల్లి గర్భంలో నుంచి ఎవరూ కూడా నాయకత్వ లక్షణాలతో పుట్టరు. నేర్చుకుంటూ, మార్చుకుంటూ ముందుకెళ్లేవాడే నాయకుడు అవుతాడు తప్పా మూస పద్ధతిలో కొనసాగేవాడు నాయకుడు కాడు” అని వ్యాఖ్యానించారు. “మీరు నిటారుగా నిలబడండి.. మీ వెనుక నేను ఉన్నానని హామీ ఇచ్చారు.. ఎవరు ఏమంటారో చూసుకుంటా.. అసలు భయపడేది లేదు.. వచ్చే జమానా ఆడబిడ్డలదే.. సగం సీట్లు ఆడబిడ్డలకే వస్తాయి.. అన్నదమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండాలి” అని సూచించారు. లీడర్ శిక్షణా తరగతులు ప్రతి జిల్లాలో నిర్వహిస్తామని, ఈ ప్రోగ్రామ్ కేవలం ట్రయల్ మాత్రమేనన్నారు. “మనసులో గట్టిగా అనుకుని బయలుదేరితే మనల్ని ఆపే దమ్ము ఎవరికి లేదు” అని ఆమె వెల్లడించారు. తెలంగాణ జాగృతి(Telangana Jagruti) బిడ్డలు ఎంతదూరం అయినా వెళ్తారన్నారు.
Also Read: Etela Rajender: ప్రభుత్వాలు ప్రేమతో ఇవ్వట్లేదు.. పోరాటాల ద్వారానే పథకాలు
