Kaleshwaram project: నేషనల్ డ్యామ్ సేప్టీ అథారిటీ (NDSA) రిపోర్టు ఆధారంగానే సీబీఐ ఎంక్వైయిరీ చేసే అవకాశం ఉన్నదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. పీసీ ఘోష్ కమిషన్(PC Ghosh Commission) రిపోర్టు ప్రకారం సీబీఐ విచారణ సాధ్యం కాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా.. సీబీఐ ఎంక్వైయిరీకి ఎలాంటి చిక్కులు ఉండవనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. ఎన్ డీఏస్ ఏ రిపోర్టులో గత ప్రభుత్వం తప్పిదాలు, నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నదని, దాని ప్రకారం సీబీఐ(CBI) తప్పనిసరిగా ఈ కేసును టేకాప్ చేస్తుదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అవసరమైతే సుప్రీం కోర్టు మెట్లు ఎక్కే ఛాన్స్ కూడా ఉన్నదని ప్రభుత్వ వర్గాలు నొక్కి చెప్తున్నాయి.ఎన్ డీఏస్ ఏ రిపోర్టు ఆధారంగానే కేంద్రం కూడా తిరస్కరించే ఛాన్స్ లేదనేది సమాచారం.
కేంద్రం అంగీకరిస్తుందా?
అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలు, డిజైన్ లోపాలు, నిర్వహణ వైఫల్యాలపై విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దర్యాప్తు సంస్థలు ఎలాంటి డిసిషన్ తీసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. సీబీఐ విచారణకు కేంద్రం అంగీకరిస్తుందా? లేదా? అనేది సస్పెన్షన్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐ ఎంక్వైయిరీని కోరినా..దర్యాప్తు సంస్థలు కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరినట్లు తమకు సమాచారం అందినట్లు సీబీఐ అధికారి ఒకరు అకౌనాలెడ్జ్ మెంట్ కూడా చేశారు. ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత విచారణ కు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐ ఎంట్రీకి జీవో ఇచ్చింది. మూడేళ్ల కిందట రాష్ట్రంలోకి సీబీఐ ఎంటర్ కాకుండా కేసీఆర్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తూ ప్రత్యేక జీవో ఇవ్వడం గమనార్హం.
Also Read: Modi Xi Meet: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిసి.. కీలక ప్రకటన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
హో మ్ మినిస్టర్ అప్రూవల్ మస్ట్…?
జస్టిస్ పీసీ ఘోస్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్,మాజీ మంత్రి హరీష్ రావుపై ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సమ్మతించడంపై బీజేపీ(BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై రాజకీయంగా తీవ్ర ఒత్తిడి ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఏదైనా ఒక రాష్ట్రంలోని కేసును సీబీఐ(CBI)తో విచారణ చేయించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే, సీబీఐకి చెందిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లీష్‌మెంట్ యాక్ట్‌లోని సెక్షన్-6 కింద ఆ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి. అనంతరం,ఆ కేసును సీబీఐతో విచారించేందుకు కేంద్ర హోం మినిస్టర్ అనుమతి తప్పనిసరి. అందుకు అనుగుణంగా సెక్షన్-5 కింద కేంద్రం సమ్మతి తెలపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయంపై అందరికీలోనూ ఉత్కంఠ నెలకొన్నది.
హైకోర్టు ఉత్తర్వులు కన్సిడర్ చేస్తే..?
ఇక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సాకుగా చూపి సీబీఐ విచారణకు కేంద్రం సమ్మతించకపోతే బీఆర్ఎస్-బీజేపీ బంధం మరోసారి బహిర్గతమైందనే సందేశం క్షేత్ర స్థాయిలో మరింత బలపడుతుందని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, విచారణకు అంగీకరించకపోతే పొత్తు ప్రచారం క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తుందని, రానున్న ఎన్నికల్లో అది పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని స్వయంగా బీజేపీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో ఏకపక్ష నిర్ణయాలు, ఇష్టారీతిన సవరించిన ప్రాజెక్టు అంచానలతో జరిగిన అవినీతి ఆరోపణు, నిర్వహణ వైఫల్యాలపై జస్టిస్ ఘోస్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్‌ను, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ సహా ఇతర ఉన్నతాధికారులను బాధ్యులను చేసింది. అంతేకాకుండా వారిపై చర్యలు తీసుకొవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ సిఫార్సు చేసింది. దీంతోనే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోం శాఖకు సిఫారసు చేసింది. ఇదిలా ఉండగా, గతంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయల్ లు కూడా కాళేశ్వరం కేసును సీబీఐకు అప్పగించాలని పదే పదే కోరారు.
Also Read: UP Principal: నాకు భార్యగా ఉండిపో.. పరీక్షల్లో పాస్ చేస్తా.. ఏడో క్లాస్ బాలికపై ప్రిన్సిపల్ శాడిజం