Kaleshwaram Project: అసెంబ్లీలో కాళేశ్వరంపై నివేదిక ప్రతులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Min Uttam Kumar Reddy) సభ్యులకుఅందజేశారు. దానిపై స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మొదలుకొని కూలిపోయేంత వరకు జరిగిన గత ప్రభుత్వ తప్పిదాలను ప్రభుత్వం ఎండగట్టింది. మాజీ సీఎం కేసీఆర్(KCR), మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao), మాజీ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్(Etela Rajender)లపై కమిషన్ చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనిపై ఏం చర్యలు తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అన్నిపార్టీల అభిప్రాయాలు వెల్లడించిన తర్వాత ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సీబీఐ(CBI) విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గులాబీలో గుబులు మొదలైంది. కేసీఆర్, హరీష్ రావులను ఇద్దరు బాధ్యులను చేస్తుండటంతో వారిపై ఏం చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
సభ నుంచి వాకౌట్
ఇప్పటికే శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడనివ్వలేదని బీఆర్ఎస్(BRS) వాకౌట్ చేసింది. నివేదిక ప్రతులను సైతం గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు. కమిషన్ వేదికగా కాదని.. అదొక చెత్త రిపోర్టు అని బీఆర్ఎస్(BRS) ఘాటుగా స్పందించింది. మరోవైపు బీజేపీ(BJP) సైతం కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడనివ్వలేదని సభ నుంచి వాకౌట్ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం సభ తెల్లవారుజామున 1.30 గంటల వరకు సభను నిర్వహించింది. తమ్మడి హెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును తరలించడం, రిటైర్డ్ ఇంజనీర్లు సూచించినప్పటికీ మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును నిర్మించడంతో నాలుగేళ్లలోనే కుప్పకూలిందని మండిపడింది. కేసీఆర్ అనుసరించిన విధానాన్ని, ఏకపక్ష నిర్ణయాలను తిప్పికొట్టింది. చేసిన తప్పుకు ఉరితీసిన తప్పులేదని సీఎం మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
Also Read: Vishal Wedding: విశాల్, సాయి ధన్సికల పెళ్లి ఎప్పుడంటే..
సీబీఐకి అన్ని ఆధారాలు
శాసనసభ సమావేశాలు ఆదివారమే ముగిసినప్పటికీ కాళేశ్వరం మంటలు మాత్రం ఆరలేదు. బీఆర్ఎస్(BRS) నేతలు కాళేశ్వరంపై సీబీఐ వేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్, బీఆర్ఎస్ పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు మాత్రం సీబీఐ విచారణను స్వాగతించారు. కాళేశ్వరంపై నిగ్గుతేల్చాల్సింది సీబీఐ మాత్రమేనని స్పష్టం చేశారు. సీబీఐకి అన్ని ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీసీ ఘోష్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ పై బీఆర్ఎస్ పిచ్చివాగుడు వాగుతుందని, కారు పార్టీకి చిత్తశుద్ధి సీబీఐ ఎంక్వైరీని ఎదుర్కోవాలని,కాళేశ్వరం అవినీతి సొమ్ము దేశాలు దాటిందని ఆరోపించింది. ఎంఐఎం సైతం కాళేశ్వరంపై నిగ్గుతేల్చాల్సిందేనని డిమాండ్ చేస్తుంది.
Also Read: Transgenders: ట్రాన్స్ జెండర్లకు రుణాలిస్తున్న జీహెచ్ఎంసీ.. ఎందుకో తెలుసా..?