Harish Rao ( iMAGE CREDIT: SWETCHA REPORTER)
Politics

Harish Rao: జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్ వచ్చుడే కష్టం.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao: జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ వచ్చుడే కష్టం అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఏం చేసింది.. బీజేపీ ఏం చేసింది అనేది ఒకసారి ఆలోచించాలన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ద్రోహం చేశాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలు చెప్పేదొకటి చేసేదొకటి అన్నారు. తెలంగాణ భవన్ లో బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీజేపీ నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ భర్తను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆడబిడ్డ సునీతను అవమానించే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దుర్మార్గం అన్నారు. విజ్ఞత మరచి విచక్షణ లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Also ReadHarish Rao: జోర్డాన్ గల్ఫ్ కార్మికులను స్వదేశానికి తీసుకురావాలని హరీష్ రావు డిమాండ్!

పెద్దోళ్ల ఇల్లులు కూలగొట్టట్లేదు

ప్రజలు విజ్ఞులు ప్రజలు మంచి, చెడు ఆలోచిస్తారన్నారు. రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాణ్ అని అంటారు.. మోడీ సబ్ కా సాత్ సబ్కా వికాస్ అంటారు.. కానీ జరుగుతున్నది ఏమిటి? హైడ్రా పేరిట పేదవారి ఇల్లు కూలగొట్టడం మొహబ్బత్ దుకాణ్ ఆ? అని నిలదీశారు. పెద్దోళ్ల ఇల్లులు కూలగొట్టట్లేదు. పేదోళ్లు ఇల్లులు ఎందుకు కూల కొడుతున్నావ్ రేవంత్ రెడ్డి అని రాహుల్ గాంధీ ఎందుకు అడగడం లేదు అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ బీహార్ లో ఓట్ చోరీ అంటున్నాడు.. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటు చోరీ చేస్తుంటే ఎందుకు మాట్లాడవు రాహుల్ గాంధీ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చేసిందేముంది హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టుడు తప్ప అని మండిపడ్డారు.

దేశంలో 157 మెడికల్ కాలేజీలు

భర్తను కోల్పోయిన ఆడబిడ్డను ప్రజంతా దీవించాలని కోరారు. బీజేపీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటారు..కానీ, గోదావరి పుష్కరాలకు ఆంధ్రప్రదేశ్ కు 100 కోట్లు ఇచ్చి తెలంగాణకు గుండు సున్నా ఇచ్చారని.. ఇది సబ్కా సాత్ సబ్కా వికాస్ అవుతుందా?.. తెలంగాణ నీటిని దోపిడి చేసే బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర బీజేపీ మద్దతిస్తున్నది.. అనుమతులు ఇస్తున్నది… తెలంగాణకు ఏమిస్తున్నారో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ప్రకటిస్తే ఒక్క మెడికల్ కాలేజీను కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు. ఏపీకి బడ్జెట్లో ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చిన బీజేపీ తెలంగాణకు పది పైసలు కూడా ఇవ్వలేదన్నారు. బీజేపీకి 8 ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన మంచి ఇదేనా? అని నిలదీశారు. గోధుమలకు రూ.2585, వడ్లకు రూ.2369 ఇస్తున్నారని, గోధుమలకు ఓ నీతి వడ్లకు మరో నీతి ఉంటుందా? అని నిలదీశారు.

తెలంగాణ రైతులకు శాపమా?

వడ్లు పండించడం తెలంగాణ రైతులకు శాపమా? అని నిలదీశారు. ఇట్లా అన్ని విషయాల్లో బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నదన్నారు. తెలంగాణ గొంతు నొక్కడంలో కాంగ్రెస్ బీజేపీ దొందూ దొందే అన్నారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీఅన్నారు. కేసీఆర్ తో బీఆర్ఎస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు. కాంగ్రెస్ వి మొసలి కన్నీళ్లు, ఆపదమొక్కులు తప్ప ప్రజల సంక్షేమం లేదన్నారు. కాంగ్రెస్ కి నిజాయితీ ఉంటే బాకీ కార్డు పంపిస్తాం… మీరు పడ్డ బాకీ ని చెల్లించి జూబ్లీహిల్స్ లో ఓటు అడగండి అని డిమాండ్ చేశారు. చేరినవారిలో బీజేపీ సీనియర్ మహిళా నాయకులు కళావతి, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు బి.లక్ష్మి, రాష్ట్ర మహిళా మోర్చా నాయకులు శైలజ, ఆర్కే లక్ష్మీ ,అనురాధ, మంజుల, సత్యవతితో పాటు 200 వందల మంది ఉన్నారు.

Also Read: Harish Rao: బనకచర్లను ఆపే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా? లేదా?.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?