Jagga Reddy: రాహుల్ గాంధీ జోడో యాత్రలో దేశ ప్రజల సమస్యలకు పరిష్కారం చేసే దిశగా అడుగులు వేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గా రెడ్డి అన్నారు. జోడో యాత్రలో ప్రధాన అంశం అయిన కుల గణన చేయాలని రాహుల్ గాంధీ పదే పదే చెప్పే వారని గుర్తు చేశారు. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కుల గణన చేస్తామని ప్రకటన చేయడాన్ని నేను స్వాగతిస్తున్నానని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ముందు చూపుతో ఉన్నాడు ఇలా అనడానికి కుల గణన ఒకటి కారణం అని అన్నారు.
దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ హీరో అయితే తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేసినందుకు రేవంత్ రెడ్డి హీరో అని జగ్గారెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ వాళ్లు సంకలు గుద్దుకున్న లాభం లేదు రాహుల్ గాంధీకి ఎంత ముందు చూపు ఉందో అర్ధం అవుతుందని అన్నారు. ఒక వేల కుల గణనను మోడీ చేయకపోతే రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఆయనే చేసే వాడని అన్నారు. రాష్ట్ర కుల గణన లెక్కలోకి రాని వారు కేంద్ర కుల గణన లో లెక్కకు వస్తారు అని బీజేపీ వాళ్లకు మింగుడు పడటం లేదని అన్నారు.
Also Read: Caste Census Survey: కులగణనలో దేశానికే ఆదర్శం.. రాహుల్ పోరాటం ఫలించింది.. రేవంత్ రెడ్డి
ఈ విషయాన్ని రెండేళ్ల క్రితమే మోదీ చెప్తే బాగుండేదని అనుకుంటున్నారని అన్నారు. కుల గణన విషయంలో రాహుల్ గాంధీకి క్రెడిట్ వస్తుంది అని బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదని జగ్గా రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ అనే వరకు మోదీ ఎందుకు ఎదురు చూశాడు..? రాహుల్ గాంధీకి వచ్చిన ఐడియా మోడీ కి ఎందుకు రాలేదు బీజేపీ వాళ్ళ లెక్క పదవుల కోసం ఎదురు చూసే రకం కాదు మా రాహుల్ గాంధీ కుటుంబం అని ఎద్దేవా వేశారు
స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/