Harish Rao(image credit:X)
Politics

Harish Rao: నీటి వాటాల వినియోగంలో ప్రభుత్వం ఫెయిల్.. మాజీ మంత్రి ధ్వజం!

Harish Rao: “నిజం మౌనంగా ఉంటే, అబద్ధమే రాజ్యం ఏలుతుంది.”ఈ సామెత కాంగ్రెస్ పార్టీ తీరుకు అతికినట్టు సరిపోతుందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు . అబద్ధాలే ఆధారంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ అవే అబద్ధాలతో పాలన సాగిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిజం మౌనంగా ఉంటే, అసత్యమే నిజమని నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది కనుక కాంగ్రెస్ చెబుతున్న ప్రతి అబద్ధానికి ఆధారాలతో సహా నిజాన్ని ప్రజల ముందుంచడం మా బాధ్యతగా భావిస్తున్నామని హరీష్‌రావు అన్నారు.

2018 ఆక్టోబర్ 30 న డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి అందజేసిందని, 2021 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే 113.795 టీఎంసీల నీళ్లు ప్రతిపాదిత సీతారామ ప్రాజెక్టు కు అందుబాటులో ఉన్నాయని సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం నిర్ధారించిందని అన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 70.4 టీఎంసీల నీటిని వినియోగించి 6.74 లక్షల ఎకరాలకు సాగు నీటిని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఇవ్వవచ్చని ,తాగునీరుతోపాటు పారిశ్రామిక అవసరాలకు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం 2021లోనే నిర్ధారించిందని తెలిపారు.

ఇంత స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్, హైడ్రాలజీ అనుమతులు ఉన్న సీతారామ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరగలేదని, ప్రాజెక్టుకు అనుమతులు లేవని మాట్లాడడం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు ప్రచారాలకు పరాకాష్ట అని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలను తమ సొంత రాజకీయ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు.

Also read: Salman Khan: ఇక్కడ వద్దు.. పాకిస్థాన్ వెళ్లిపో.. సల్మాన్‌పై మండిపడుతున్న నెటిజన్లు!

కృష్ణా నదిలో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను పూర్తిగా వినియోగించుకోలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఆంధ్ర పాలకులు గోదావరిలో నీటి దోపిడీకి పాల్పడుతుంటే, అడ్డుకునే సత్తా కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు.

ఏడాదిన్నర పాలనలో కనీసం ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేని, ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేని కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ సాధించిన సాగునీటి విజయాలను తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నీటి దోపిడీని అడ్డుకోకుండా పదవుల కోసం పెదవులు మూసుకున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు మరోసారి తెలంగాణ నీటిని అప్పనంగా కిందకు వదులుతూ రాష్ట్ర ప్రయోజనాలను ఏపీ కి తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“అబద్ధాన్ని వందసార్లు చెప్తే నిజమవుతుంది” అనే భ్రమలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చేసిన అన్యాయాలు మరిచిపోయారా? రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ వంటి ప్రాజెక్టులు తెలంగాణకు నష్టం కలిగించి ఆంధ్రాకు లాభం చేకూర్చేలా చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? అని దుయ్యబట్టారు.

ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ హెడ్ వర్క్ ఆంధ్రాలో పెట్టి, శాశ్వతంగా తాళం వేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. రాజీవ్ సాగర్ పైప్‌లైన్ కిన్నెరసాని వన్యప్రాణి కేంద్రం గుండా వేసి, అనుమతులు రాకుండా చేసింది మీరు కాదా? కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి హక్కులను కాపాడలేని కాంగ్రెస్ చేతగానితనం వల్ల సాగర్ ఆయకట్టుకు కరువు వచ్చిందని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకునేందుకు గోదావరి జలాలే ఏకైక మార్గమని ముందుగానే గ్రహించిన కేసీఆర్ గారు సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రూపొందించారన్నారు.

మీరు సృష్టించిన అంతర్రాష్ట్ర సమస్యలు, అటవీ అనుమతుల ఇబ్బందులను అధిగమించేందుకు, కేసీఆర్ గారు సమీకృత సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేశారన్నారు. ఈ పథకం ద్వారా రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల్లో ప్రతిపాదించిన 3.33 లక్షల ఎకరాల ఆయకట్టతో పాటు, అదనంగా మరో 3.41 లక్షల ఎకరాలకు నీరందించి, నిల్వ సామర్థ్యాన్ని 1.2 టీఎంసీ నుంచి 10 టీఎంసీలకి పెంచి, 7,967 కోట్లతో పనులు ప్రారంభించారన్నారు.

Also read: Railway Recruitment Board: గుడ్ న్యూస్.. రైల్వేలో 9,970 ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి..

ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేస్తుంటే, రాజకీయ భవిష్యత్తు ఉండదన్న అక్కసుతో కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. గతంలో మీరే చేపట్టిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్‌తో పోలిస్తే సమీకృత సీతారామ ప్రాజెక్టులో నీటి కేటాయింపు 33 టీఎంసీ నుంచి 70.40 టీఎంసీకి పెరిగింది.
పైప్‌లైన్ పొడవు 77 కి.మీ నుంచి 8.56 కి.మీకు తగ్గిందన్నారు.

ఆయకట్టు 3.33 లక్షల నుంచి 6.74 లక్షల ఎకరాలకు పెరిగిందని, అంతర్రాష్ట్ర సమస్యలు, అటవీ అనుమతుల సమస్యలు లేవు. అటువంటి ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలే నాడు గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు వేసి, పనులు నిలిపివేశారన్నారు. పర్యావరణ అనుమతులు రావడానికి కూడా అడ్డుపడ్డారని అన్నారు. కేంద్రం ఆటంకాలు, కాంగ్రెస్ కుట్రలను ఛేదించి 90% పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.

“అనుమతులు లేవు” అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం అవగాహన రాహిత్యమే అని అన్నారు. TAC తప్ప అన్ని అనుమతులు పూర్తి చేశామని, అధికారులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి గారికి సూచిస్తున్నామని తెలిపారు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?