Harish Rao(image Credit: twitter)
Politics

Harish Rao: బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతాం.. హరీశ్ రావు సంచలన కామెంట్స్!

Harish Rao: నీళ్ల కోసం మరో తెలంగాణ ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) స్పష్టం చేశారు. బనకచర్ల విషయంలో ఢిల్లీ మెడలు వంచుతామని తేల్చి చెప్పారు. మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొని ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా హరీశ్(Harish Rao) మాట్లాడుతూ రేవంత్, ఢిల్లీ తన చేతిలో ఉందని చంద్రబాబు అనుకుంటున్నాడని, రేవంత్, ఢిల్లీ ఒప్పుకున్నా తెలంగాణ సమాజం బనకచర్లకు ఒప్పుకోదన్నారు. సుప్రీం కోర్టుకు వెళ్ళి బనకచర్లను అవుతామన్నారు. అవసరమైతే మరో తెలంగాణ ఉద్యమం మొదలు పెడతామని హెచ్చరించారు. ఉస్మానియా, కాకతీయ మళ్ళీ ఉద్యమ వేదికలై తెలంగాణ హక్కులు కాపాడతాయని తెలిపారు.

Also Read: KTR vs Ramesh: గతంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన కవిత.. మళ్లీ తెరపైకి తెచ్చిన ఎంపీ సీఎం రమేష్

నిద్రలో కూడా..
‘ జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం. రైలు రోకో చేస్తాం. ఢిల్లీ మెడలు వంచుతాం తప్పా ఒక్క నీటి చుక్క కూడా వదులుకోం. (Revanth Reddy) రేవంత్‌రెడ్డికి నచ్చని ఒకే ఒక నినాదం జై తెలంగాణ. ముఖ్యమంత్రికి నిద్రలో కూడా కేసీఆర్‌(KCR) పేరు తలచుకుంటున్నారు. మన ఆత్మగౌరవ నినాదమే జై తెలంగాణ. ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయింది బీజేపీ కిషన్‌రెడ్డి,(Kishan Reddy) రేవంత్‌రెడ్డి ఇద్దరే. ఉద్యమ జ్ఞాపకాలను చెరిపేసేందుకు రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్‌ 14 ఏండ్ల పోరాటం, ఆమరణ దీక్ష భవిష్యత్‌ తరాలకు చెప్పాలని పిలుపు నిచ్చాం. లేకపోతే చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కలిసి మన అస్థిత్వాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు. రేవంత్‌ పాలనలో నిధులు ఢిల్లీకి, ఏపీకి వెళ్తున్నాయి. ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో తెలంగాణపై కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను బద్దలు కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రేపటి తరం యువకులుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని హరీశ్ పిలుపునిచ్చారు.

ఎన్ని కుట్రలు చేసినా..
‘ కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా మనం దక్కించుకోవాలి. గోదావరి బనకచర్ల ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. తెలంగాణ వాటా ఎంత, ఏపీ వాటా ఎంతో తేలిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులు కట్టాలి. కానీ ,కేంద్ర తన చేతుల్లో ఉందని బుల్డోజ్‌ చేసి ప్రాజెక్ట్‌ నిర్మాణానికి చంద్రబాబు కుట్ర పన్నారు. 200 టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమకు తరలించేదే బనకచర్ల. నికర జలాలే ఇంకా లెక్క తేలలేదు, వరద జలాలు ఎక్కడివి?. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకున్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌ ఊరుకోలేదు. కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డలో 2 ఫిల్లర్లు కుంగితే మొత్తం కూలిందని చెబుతున్నారు. కాంగ్రెస్‌ మోసాన్ని గ్రామగ్రామాన చెప్పాలి. కాంగ్రెస్ నేతలు గోబెల్స్‌ ప్రచారంతో అధికారంలోకి వచ్చారు. కేసీఆర్‌ రూ.20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు కానీ, రేవంత్‌రెడ్డి రూపాయి కూడా ఇవ్వలేదు’ అని హరీశ్ రావు మండిపడ్డారు.

 Also Read: GHMC: ఒకే పోలింగ్ బూత్‌లో ఫ్యామిలీ ఓటింగ్.. కసరత్తు చేస్తున్న జీహెచ్ఎంసీ

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు