Harish Rao (imagecredit:swetcha)
Politics, తెలంగాణ

Harish Rao: డబ్బు మద్యం సీసాలకు మనం అమ్ముడు పోవద్దు: హరీష్ రావు

Harish Rao: వంద రోజుల్లో ఆరు గారంటీలు అమలు చేస్తామని మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి ఓటు తో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) పిలుపు నిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడలో ఆదివారం నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఉప ఎన్నికల్లో భాగంగా ఇంటింటికీ బాకీ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని బీఆర్ఎస్(BRS) కు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో ఇంటింటికి బాకీ కార్డు అందించడం ద్వారా తెలియజేస్తున్నామన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డులను పంచి 22 నెలలైనా ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినా ప్రజలు అడగడం లేదని అనుకుంటున్నారన్నారు.

ఫీజు రీయంబర్స్మెంట్..

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడితే రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం ఏం పడిపోదు అన్నారు. కానీ, ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నా, ప్రతి మహిళకు 2500 రావాలన్నా, ప్రతి వృద్ధులకు 4000 రావాలన్నా, యువతకు రెండు లక్షల ఉద్యోగాలు రావాలన్నా, కాలేజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ మెంట్ కావాలన్నా, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బుద్ధి చెప్పాలని కోరారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని ఊడగొడితే ఇచ్చిన హామీలు అమలు అవుతాయన్నారు. ఒకవేళ గెలిపిస్తే మేము హామీలు అమలు చేయకపోయినా ప్రజలు ఏమనడం లేదనుకుంటారన్నారు. మోసం చేసిన కాంగ్రెస్కు మీ ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. మోసం చేసిన కాంగ్రెస్ కి ఓటు వేయడమంటే మన వేలుతో మన కన్నులు పొడుచుకోవడమే అన్నారు.

Also Read: Crime News: కొడుకు చెడిపోవడానికి తల్లే కారణం అని.. భార్యను అతి కిరాతకంగా చంపిన భర్త

బీఆర్ఎస్ అభ్యర్థి సునీత..

కాంగ్రెస్ డబ్బులని నమ్ముకుందని, అధికార దుర్వినియోగాన్ని చేస్తూ పోలీసుల ద్వారా గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. డబ్బుకో, మద్యం సీసాలకో మనం అమ్ముడుపోవద్దు.. కాంగ్రెస్ ఇచ్చే డబ్బులు మీ ఎడమకాలితో తన్ని బీ ఆర్ఎస్ ని గెలిపించాలని కోరారు. గోపీనాథ్ ఏ రకంగా అయితే మీ సేవలో ఉన్నారో మా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కూడా పేదల పక్షాన ఉంటారన్నారు. సగటు మహిళల కష్టాలు తీరాలంటే సునీత జూబ్లీహిల్స్ లో గెలవాలన్నారు. గోపికి నిజమైన నివాళి ఇవ్వాలంటే సునీతని గెలిపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను తీవ్రంగా మోసం చేసిందన్నారు.

విద్య కూడా భ్రష్టు..

షాదీ ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేశారన్నారు. కొడంగల్ లో మసీద్ దర్గాను కూల్చివేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మైనార్టీలకు 4000 కోట్లు బడ్జెట్ పెడతామన్నారని, కనీసం ఒక వెయ్యి కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. కేసీఆర్(KCR) నిర్మించిన మైనార్టీ స్కూళ్లలో విద్యను కూడా భ్రష్టు పట్టించారన్నారు. కాంగ్రెస్(Congress) ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్(BRS) మైనార్టీని హోం మంత్రిని చేసిందని, దేశం అబ్బురపడే విధంగా 203 మైనార్టీ స్కూళ్లను కేసీఆర్(KCR) ప్రారంభించారన్నారు. ఇమామ్, మౌజములకు జీతం పెంచుతా అని పెంచకుండా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.

Also Read: KTR: ఆర్టీసీ బస్సు చార్టీల పెంపు దారుణం.. ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!