Harish Rao: రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? అని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) మండిపడ్డారు. ఎక్స్ వేదికగా జర్నలిస్టుల అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన చేతగాని సర్కారు. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అన్నారు. ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా? జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి అని అభివర్ణించారు. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి అన్నారు. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా డిజిటల్ మీడియా పై సిట్లతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు?.. మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం అన్నారు. ఇదేనా కాంగ్రెస్ ప్రజాపాలన?.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ?.. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
డిజిపి తో మాట్లాడిన హరీష్ రావు
రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టుల విషయమై రాష్ట్ర డీజీపీతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. అర్ధరాత్రి పండుగ పూట జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్ళి అరెస్టులు చేయడం అవసరమా.. ప్రొసీజర్ అనుసరించకుండా నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్టులు చేస్తారు.. జర్నలిస్టులు ఏం క్రిమినల్స్ కాదు టెర్రరిస్టులు కాదు? వారిపట్ల ఎందుకు అంత కఠినంగా వ్యవహరిస్తున్నారు.. వాళ్ల కుటుంబాలు మానసిక వేదనకు గురవుతాయి, పండుగ పూట అరెస్టులు సరికాదని, అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు.
Also Read: Harish Rao: పొమ్మనలేక పొగ పెట్టే ప్రయత్నం? పార్టీలో కీలక నేతగా ఎదిగితే గెంటేయడమేనా?

