Harish Rao( IMAGE credit: twitter)
Politics

Harish Rao: అసెంబ్లీలో బనకచర్లపై చర్చకు సిద్ధం.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్!

Harish Rao:  తెలంగాణ నీటి హక్కులకు మరణశాసనం రాసిందే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. ప్రజా భవన్ వేదికగా 2024 జూలై 6న ఏపీ సీఎం చంద్రబాబుతో (Chandrababu)  విభజన హామీల ముసుగులో ప్రజా భవన్ వేదికగా బనకచర్ల ఒప్పందం కుదురిందని ఆరోపించారు. గతేడాది సెప్టెంబర్ 23న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తిని బనకచర్లకు పచ్చజెండా ఊపారన్నారు. నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే ప్రజా భవన్‌లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌కు కేవలం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులనే పిలిచారని విమర్శించారు.

హరీశ్ రావు తెలంగాణ భవన్‌లో (Telangana bhavan)  మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ (BRS)  పదేండ్ల పాలనలో బనకచర్లపై ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు తాము సిద్ధమని, సీఎం రేవంత్ రెడ్డి  (Revanth Reddy)సిద్దమా అని సవాల్ చేశారు. 15రోజులు గోదావరిపై, 15 రోజులు కృష్ణాపై చర్చిద్దామని, ప్రజల సాక్షిగా మాట్లాడుదామని, ఒక్క కండీషన్ మైక్ కట్ చేయొద్దు అని కోరారు. ఏదైనా ఉంటే ఎన్నికలకు ముందు చూసుకుందామన్నారు.

 Also Read: Phone Tapping: షాద్‌ నగర్‌ చుట్టూ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం!

ఉత్తమ్ పీపీటీ చంద్రబాబు తయారు చేశారు
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ( Hyderabad)  హైదరాబాద్‌లో కాకుండా అమరావతి నుంచి ఇచ్చినట్లు ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)  అన్నారు. ఉత్తమ్ పీపీటీ చంద్రబాబు తయారు చేశాడా అనే అనుమానం కలుగుతుందన్నారు. బనకచర్లను ఆపాలని చిత్తశుద్ది ఉంటే మీరు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలు, ఆయన మాట్లాడిన మాటలు గాని చూపాలన్నారు. కాళేశ్వరం, పాలమూరు, డిండి, తుమ్మిళ్ల, భక్తరామ దాసు వంటి అనేక ప్రాజెక్టును చంద్రబాబు (Chandrababu) అడ్డుకున్నాడని, ఎందుకు ఒక్క ముక్క కూడా పీపీటీలో చూపించలేదన్నారు. రేవంత్ రెడ్డికి బనకచర్ల కట్టే బాబు బంగారం లెక్క కనిపిస్తే, బీఆర్ఎస్ సచ్చిన పాము లెక్క కనిపిస్తున్నదని మండిపడ్డారు. చంద్రబాబు (Chandrababu) తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్న విషయాన్ని ఎందుకు చూపించలేదని నిలదీశారు. తెలుగుదేశం, చంద్రబాబుతో ఉన్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇంకా మర్చిపోలేక పోతున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ పోరాటంతోనే బనకరచర్లకు అనుతులు రాలే
బీఆర్ఎస్ పోరాటంతోనే కేంద్ర ప్రభుత్వం బనకచర్లకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని హరీశ్ రావు Harish Rao పేర్కొన్నారు. బీఆర్ఎస్ సచ్చినపాము అయితే ఎందుకు విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party)  ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా గెలువలేదని, అంతమాత్రాన ఆ పార్టీ చచ్చిన పాము అవుతుందా? అని ప్రశ్నించారు. చచ్చిన పాము ముచ్చట్లు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి చెప్పుకోవాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పేరు ఎత్తకుండా ఒక్కసారైనా రేవంత్ రెడ్డి ఉండగలరా అని ప్రశ్నించారు. కృష్ణా నీళ్లలో 299 టీఎంసీలు, ఏపీకి 512 ఒప్పందం చేసుకొని ద్రోహం కాంగ్రెస్ పార్టీదే అన్నారు. తెలంగాణకు పట్టిన అబద్దాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి, (Revnath Reddy) అబద్దాల వైరస్‌కు విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా అన్నారు.

కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ( kishn Reddy)  సీఎం రేవంత్ రెడ్డిది (Revanth Reddy) ఫెవికాల్ బంధం అని హరీశ్ రావు మండిపడ్డారు. ఇద్దరు కలిసి తెలంగాణ నీటి ప్రయోజనాలు దెబ్బ తీశారని ఆరోపించారు. ఆనాడు మేడిగడ్డలోని 85 పిల్లర్స్‌లో ఒక్క పిల్లర్ కుంగితే వెంటనే ఎన్డీఎస్ఏకు కిషన్ రెడ్డి లేఖ రాశారని, ఎస్ఎల్బీసీ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయితే ఎందుకు మాట్లాడలేదని, ఎందుకు ఎన్డీఎస్ఏకు లేఖ రాయలేదని నిలదీశారు. కృష్ణాలో గత పదేండ్లలో ఎప్పుడూ వాడనంత తక్కువ నీటిని 28శాతం వాడిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అని మండిపడ్డారు.

Also Read: Handloom Workers Loan: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు