Harish Rao: ‘నా 25 ఏండ్లుగా తన రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజలముందు తెరిచిన పుస్తకం లాంటిది’ అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao)అన్నారు. గత కొంతకాలంగా తనపై, పార్టీ పై కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలనే వారు(కవిత) కూడా చేయడం జరిగింది. తనపై ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. లండన్ వెళ్లి తిరిగి హైదరాబాద్(Hyderabad)కు చేరుకున్న సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత( Kavitha) వ్యాఖ్యలపై స్పందించారు.
Also Read: Kavitha: ఈ ఇద్దరి అవినీతి వల్లే కేసీఆర్‌పై సీబీఐ విచారణ.. కవిత సంచలన కామెంట్స్
ఎరువుల దొరకక రైతులు గోసపెడుతున్నారు
కేసీఆర్(KCR) నాయకత్వంలో గత రెండున్నర దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా, రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్దత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదేనన్నారు. రాష్ట్రంలో ఎరువుల దొరకక రైతులు గోసపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసీఆర్ దశాబ్దకాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను.. ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశ పూర్వకంగా ఈ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తుందని మండిపడ్డారు.
కలిసి కట్టుగా ముందుకు సాగుతాం
ఇటువంటి పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే విషయంలో తెలంగాణ ద్రోహుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే విషయంలో మా దృష్టి అంతా ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాటం చేసిన వాళ్లం.. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో బాధ్యత కలిగిన వాళ్లం.. మా సమయాన్నంతా దానిమీదనే వెచ్చిస్తామన్నారు. తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలో తిరిగి అధికారంలోకి తెచ్చుకొని ఈ ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించడానికి అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతామని వెల్లడించారు.
Also Read: Kavitha Letter: పదవి ఉన్నా లేకున్నా డోంట్ కేర్.. నా మద్దతు కార్మికులకే.. ఎమ్మెల్సీ కవిత