Harish Rao on CM Revanth: రైతులకు ఏం చేశావని సంబురాలు చేస్తున్నావ్ రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) నిలదీశారు. ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆపి, 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15,000 చొప్పున ఇస్తామని చెప్పి 12,000కి పరిమితం చేయడం మోసం చేయడమే అన్నారు. గత వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టి, యాసంగిలో ఎగ్గొట్టి, ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట సంబురాలు జరపడం (Farmers) రైతులను మోసం చేయడమే అన్నారు. ‘చెప్పింది కొండంత, చేసింది గోరంత. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టావు.
Also Read: Software Employee Arrest: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి లక్షల జీతం వదిలి డ్రగ్స్ దందా!
అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు. రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? కౌలు (Farmers) రైతులకు రైతు భరోసా ఇవ్వనందుకా? రైతు కూలీలందరికి ఆత్మీయ భరోసా అని ఇవ్వకుండా మోసం చేసినందుకా? రుణమాఫీ చారణ చేసి బారాణ మందిని మోసం చేసినందుకా? అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేసినందుకా? 1200 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించినందుకా? రైతు బీమా అమలు ప్రశ్నార్థకం చేస్తున్నందుకా? పంట బీమా అని చెప్పి ఉసురుమనిపించినందుకా? రైతన్నలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసినందుకా? లగచర్ల, రాజోలి రైతుల చేతులకు బేడీలు వేసినందుకా? వరంగల్ రైతు డిక్లరేషన్‌ను అటకెక్కించినందుకా? మీ దుర్మార్గ పాలనలో 511 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకా? ఎందుకు సంబురాలు చేస్తున్నారో చెప్పండి’ అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
సంక్షోభంలో రైతుల బతుకులు
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు రైతుల (Farmers) బతుకులు సంక్షోభంలో కూరుకుపోయాయని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. బీఆర్ఎస్ (BRS) పాలనలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్న రైతన్న, ఇప్పుడు ప్రభుత్వ పథకాలు అందక పంట పొలాల్లోనే కుప్ప కూలుతున్నాడన్నారు. (BRS) బీఆర్ఎస్‌ది రైతు సంక్షేమ ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ ది రైతు సంక్షోభ ప్రభుత్వం అని మండిపడ్డారు.
కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే, మీరు ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న నీ జిమ్మిక్కులను రైతులు నమ్మరన్నారు. (Farmers) రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు.
Also Read:Meenakshi Natarajan: పార్టీని మరింత పటిష్టం చేయాలి.. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ స్పష్టం!