Harish Rao (imagecredit:twitter)
Politics, తెలంగాణ

Harish Rao: రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాటం

Harish Rao: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish rao) స్పష్టం చేశారు. అన్ని జిల్లా కేంద్రంలో బాకీ కార్డులు పెట్టి యువతను ఏకం చేస్తామని వెల్లడించారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ(JAC) అధ్వర్యంలో హైదరాబాద్(Hyderabad) నెక్లెస్ రోడ్డు లోని జలవిహార్ లో నిర్వహించిన కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డు ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ ఆర్.కృష్ణయ్య(MP R. Krishnaiah), సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(John Wesley), నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి(Rakesh Reddy), గెల్లు శ్రీనివాస్ యాదవ్తో(Gellu Srinivas Yadav) కలిసి శుక్రవారం ఆవిష్కరించారు.

రాజీవ్ యువ వికాసం..

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ నిరుద్యోగుల పక్షాన ప్రత్యక్ష పోరాటం బీఆర్ఎస్(BRS) చేస్తుందని, మీకు అండగా ఉంటుందన్నారు. ఇచ్చిన మాట నిలుపుకో అని బాకీ కార్డులు రేవంత్ రెడ్డి*(Revanth Reddy)ని ప్రశ్నిస్తున్నాయన్నారు. ఎన్నికల ముందు వేడుకున్నడు, వాడుకున్నడు. అధికారంలోకి వచ్చాక వదిలేసారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) లతో అశోక్ నగర్, సరూర్ నగర్ స్టేడియంలో మీటింగులు పెట్టించారని, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని మాయ మాటలు చెప్పారు.. మోసం చేశారన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు గానీ, రెండు నెలల ముందే మద్యం నోటిఫికేషన్లు ఇచ్చారని ఆరోపించారు. జాబ్ క్యాలెండర్(Job calendar) అని జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు. 2లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ(DSC) బోగస్ అని, రాజీవ్ యువ వికాసం వికసించకముందే వాడిపోయిందని దుయ్యబట్టారు. జూన్ 2న 5లక్షల మంది నిరుద్యోగులకు యువ వికాసం కింద సాయం చేస్తాం అన్నాడని, మాటలు బోగస్ హామీలు బోగస్.. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడన్నారు. కాంగ్రెస్ ను జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ఓడించాలే అని ప్రజలకు, యువతకు పిలుపు నిచ్చారు.

Also Read: Mario Movie: నవంబర్‌లో.. ఎ టర్బో-చార్జ్‌డ్ ర్యాంప్ రైడ్.. తాజా అప్డేట్ ఇదే!

కేవలం 10వేల ఉద్యోగాలు..

జాబులు నింపండి అంటే జేబులు నింపుకుంటున్నారని, గల్లా పెట్టెలు నింపుకుంటున్నారని ఆరోపించారు. విద్య శాఖ మంత్రి, మున్సిపల్ మంత్రిగా, హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టీఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించిందని, నేడు ఈ ప్రభుత్వం మంత్రులు, ముఖ్యమంత్రి గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. లక్షా 64వేల ప్రభుత్వ ఉద్యోగాలను బీఆర్ఎస్ ఇచ్చిందని, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆలస్యం అయ్యింది.. 95శాతం లోకల్ రిజర్వేషన్ సాధించామన్నారు. కాంగ్రెస్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేసింది కేవలం 10వేల ఉద్యోగాలు మాత్రమేనన్నారు. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ జెన్కో, జీపీవో, పోలీసు, డిప్యూటీ సర్వేయర్, ఇతర గ్రూప్స్ నోటిఫికేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిద్రమొద్దు వైఖరి అవలంభిస్తోందన్నారు. యువత ప్రత్యక్ష పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజా ఉద్యమాలతోనే, పోరాటాలతోనే ప్రభుత్వం మెడలు వంచడం సాధ్యం అవుతుందన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ ఎక్కడ పోరాటాలు జరిగినా ఎర్రజెండా అండగా ఉంటుందని, ఈ నిరుద్యోగ జేఏసీ అధ్వర్యంలో విడుదలైన తెలంగాణ నిరుద్యోగ బాకీ కార్డ్ ఆవిష్కరణ కేవలం ఆరంభం మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి యువత తమ హక్కులు సాధించుకోవాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయిందని, అందుకే గ్యారంటీ కార్డులు కాస్తా బాకీ కార్డులు అవుతున్నాయని ఎద్దేవా చేశారు.

Also Read: Karimnagar: నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపుల దందా.. ఫార్మసిస్ట్ లేకుండా జోరుగా మందుల విక్రయాలు!

Just In

01

The Girlfriend: రష్మిక రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

Mass Jathara: రవితేజ ‘మాస్ జాతర’ నిడివి ఎంతో తెలుసా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదేనా? ప్రేమికులకు పండగే!

Dragon: ఎన్టీఆర్, నీల్ ‘డ్రాగన్’పై ఈ రూమర్స్ ఏంటి? అసలు విషయం ఏమిటంటే?

Private Buses: కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో తనిఖీలు.. తెలంగాణలో తొలిరోజే 4 బస్సులు సీజ్