Guvvala Balaraju: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వి మందిని ముంచే అలవాట్లని, అవి తనకు లేవని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గువ్వల బాలరాజు (Guvvala Balaraju) వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జన గర్జన పేరుతో కేటీఆర్ ప్రజలకు ఏం సందేశం ఇచ్చారో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవాచేశారు. జన గర్జన పేరుతో కేటీఆర్ గర్జించిందేంటని ప్రశ్నించారు. అచ్చంపేటలో జన గర్జన ఎందుకు నిర్వహించారో ఆయనకే క్లారిటీ లేదని చురకలంటించారు. బీఆర్ఎస్ ను ఎందుకు వీడానో తనకు క్లారిటీ ఉందని, వారికి కూడా స్పష్టంగా క్లారిటీ ఇచ్చానన్నారు.
Also Read: Karnataka 1: ‘కాంతారా ఛాప్టర్ – 1’కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏపీ డిప్యూటీ సీఎం స్పందన
కేటీఆర్ కు 50 రోజుల సమయం పట్టిందా?
నాడు విశ్వాసంతో బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మారని, కానీ నేడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకున్నారని గువ్వల ధ్వజమెత్తారు. రూ.కోట్లకు పడగలెత్తే దోపిడీదారులను, ప్రజల నెత్తిన చేయి పెట్టేవారని పార్టీలో చేర్చుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను పార్టీ మారి 50 రోజులవుతోందని, అచ్చంపేటకు రావడానికి కేటీఆర్ కు 50 రోజుల సమయం పట్టిందా? అంటూ గువ్వల సెటైర్లు వేశారు. అచ్చంపేట ప్రజలను కాకుండా ఎక్కడి నుంచి ప్రజలను తెచ్చారని గువ్వల ప్రశ్నించారు. ఎంత మొత్తంలో ఖర్చు చేశారో? ఎలా గర్జన నిర్వహించారో అందరికీ తెలుసన్నారు. రూ.2,3 కోట్ల ఖర్చుతో చేసిన జనగర్జనతో అచ్చంపేట ప్రజలకు ఏమొచ్చిందని నిలదీశారు.
సింహగర్జను , ఎదుర్కొనేందుకు కేటీఆర్ కు దమ్ముందా?
తమ పార్టీ అనుమతిస్తే సిరిసిల్లలో సింహగర్జన నిర్వహిస్తామని, ఎదుర్కొనేందుకు కేటీఆర్ కు దమ్ముందా అంటూ బాలరాజు సవాల్ విసిరారు. జన గర్జనలతో కేటీఆర్ అధికారంలోకి వస్తామని కల కంటున్నారా అంటూ ఆయన ఎద్దేవాచేశారు. కన్వర్షన్ పేరుతో రూ.వేల కోట్ల భూములను ఏ విధంగా తారుమారు చేశారో అందరికీ తెలుసన్నారు. ఈ భూముల అంశంపై కేటీఆర్ కు చర్చించే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్ ఎవరికి బొట్టు పెడితే వారే ఎమ్మేల్యే అవుతారని, వారి కాళ్ల వద్దే ఉండాలి, వారు చెప్పిందే వినాలి, కేసీఆర్ బొమ్మతోనే గెలవాలనుకోవమే సమానత్వమా? అని బాలరాజు ప్రశ్నలవర్షం కురిపించారు. కల్వకుంట్ల అవినీతిని ఎండగట్టడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శలు చేశారు.
Also Read: Karur stampede FIR: విజయ్‌కు బిగ్ షాక్.. తొక్కిసలాట ఘటన ఎఫ్ఐఆర్ లీక్.. వెలుగులోకి షాకింగ్ అంశాలు