tummala nageswara rao
Politics

Congress: అధైర్యపడొద్దు!.. అన్నదాతకు అండగా మేమున్నాం!

– రైతులకు అండగా కాంగ్రెస్ సర్కార్
– తడిసిన ప్రతీ గింజ కొంటామని స్పష్టం
– ఇప్పటికే సివిల్ సప్లయ్ అధికారుల నుంచి స్పష్టత
– మంత్రులు కూడా వరుసగా ప్రకటనలు
– మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని హామీ
– ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ
– అసెంబ్లీ సమావేశాల తర్వాత నెక్స్ట్ రైతు భరోసా

Revanth Reddy: తెలంగాణలో అకాల వర్షం రైతుల్ని నిండా ముంచింది. కోతకు వచ్చిన పంట, ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలులు, భారీ వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కళ్ల ముందే ధాన్యం తడిసిపోయి, కొట్టుకుపోతుంటే అన్నదాత కుదేలయ్యాడు. ఇటు గాలి దుమారంతో మామిడి రైతు కూడా నష్టపోయాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నదాతలకు భరోసానిస్తున్నారు మంత్రులు. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని కొంటామని సివిల్ సప్లయ్ అధికారులు స్పష్టతనివ్వగా బుధవారం మంత్రులు కూడా రియాక్ట్ అయ్యారు. చివరి గింజ వరకు కనీస మద్దతు ధరతో ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు.

ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వర్షాలకు రైతులు ఆధైర్యపడొద్దని అన్నారు. ఇది రైతు ప్రభుత్వమని, అండగా ఉంటుందని తెలిపారు. ఆకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇకపై రైతుల పంటలకు ప్రభుత్వమే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తుందని, రోబోయే బడ్జెట్ సమావేశాల తరువాత అన్నదాతలకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని తెలిపారు. రైతులు రోడ్డుపై విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్‌లో నిలబడే పరిస్థితి రాకుండా చేస్తామని చెప్పారు. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు మంత్రి తుమ్మల.

Also Read: కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. డేట్ కూడా ప్రకటించిన మంత్రి

హైదరాబాద్‌ గాంధీ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా తడిసిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని చెప్పారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారని, మిల్లర్లు తరుగు తీయడం సరికాదన్నారు. తడిసిన ప్రతి గింజా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. నల్గొండ క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ఆకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని పూర్తిస్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు మద్దతు ధర చెల్లించి మరీ ఆ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఆ బాధ్యత తమదని చెప్పారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు