Mahesh Kumar Goud: మేం తలచుకుంటే కేసీఆర్, కేటీఆర్‌లు జైలుకే
Mahesh Kumar Goud ( image credit: twitter)
Political News

Mahesh Kumar Goud: మేం తలచుకుంటే కేసీఆర్, కేటీఆర్‌లు జైలుకే.. పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష్య పూరిత సాధింపు చర్యలకు వెళ్లదని పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అలాంటి విధానం కాంగ్రెస్ అనుసరించి ఉంటే ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్, హరీష్​ రావు, కవితలు జైల్లో ఉండేవారని గుర్తు చేశారు.  ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ…ప్రజల సొమ్ము ఎవరు తిన్నా.. శిక్ష అనుభవించాల్సిందేనని నొక్కి చెప్పారు. ప్రజలకు సంబదించిన కోట్ల రూపాయలు కేటీఆర్ ట్రాన్స్ఫర్ చేయడం నిజమేనని వివరించారు. ఫార్ములా ఈ వన్ రేసులో కేటీఆర్ తప్పిదాలు చేశారన్నారు. మోదీ, రేవంత్ చీకటి ఒప్పందం చేసుకొని ఉంటే 6 నెలల ముందే కేటీఆర్ కు విచారణకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చేదన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ ఓడిపోయినందునే గవర్నర్ అనుమతి ఇచ్చారన్నారు.

Also Read: Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ విజయం ఖాయం.. మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు

చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు

ఇక 42 శాతం రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉన్నదని, చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్లు వచ్చాకనే స్థానిక సంస్థలకు ముందుకు వెళ్తె బెటర్ అంటూ సలహా ఇచ్చారు. అయితే కానీ కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలకు వెళ్లాల్సి వస్తున్న నేపథ్యంలో పార్టీ పరంగా ఇస్తామని ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ సహకరించి ఉంటే రిజర్వేషన్లు ప్రాసెస్ ఇప్పటి వరకు పూర్తయ్యేదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఏమీ తెలియదన్నారు. 9వ షెడ్యూల్ లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ కు చట్టాలపై అవగాహన లేదన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకు అప్పగిస్తే కేసీఆర్ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. కనీసం ఇప్పటి వరకు ఎఫ్​ ఐఆర్ కూడా నమోదు చేయకపోవడం విచిత్రంగా ఉన్నదన్నారు.

Also Read: Mahesh Kumar Goud: డిప్యూటీ సీఎం అంటూ ప్రచారం.. టీపీసీసీ చీఫ్ ఆసక్తికర కామెంట్స్

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం