Mahesh Kumar Goud: జిల్లాల్లోనూ జంబో కమిటీలు ఏర్పాటు చేయాలని టీ పీసీసీ(TPCC) నిర్ణయించింది. ప్రతి జిల్లాకు ఓ డీసీసీ, ట్రెజరర్ తో పాటు ప్రతి అసెంబ్లీకి ఒక వైస్ ప్రెసిడెంట్, స్పోక్స్ పర్సన్, ఇద్దరు జనరల్ సెక్రటరీలను నియమించనున్నారు. ఇక ప్రతి మండలానికి ఒక సెక్రటరీ తో పాటు గ్రామ స్థాయి నుంచి కమిటీలు నియమించనున్నారు. అయితే డీసీసీ(DCC) నియామకాలను నేరుగా ఏఐసీసీ(AICC) చేయనున్నది. దేశ వ్యాప్తంగా ఈ విధానం అమల్లో ఉన్నది. దీంతో డీసీసీలు మినహా, మిగతా కమిటీల లిస్టుకు టీపీసీసీ అప్రూవల్ వచ్చింది. తుది జాబితాను పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) పరిశీలించి, ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం. సీఎం పరిశీలన అనంతరం రెండు మూడు రోజుల్లోనే కమిటీలను ప్రకటించనున్నారు. ఈ కమిటీల నియామకంపై ఉమ్మడి జిల్లాల ఇన్ చార్జీలు, పార్లమెంట్ ఇన్ చార్జీ, అసెంబ్లీ ఇన్ చార్జ్లతో పార్టీ పలుమార్లు సమీక్షించింది. పార్టీ కోసం కష్టపడిన నేతలు, ప్రజలతో మమేకమయ్యే లీడర్ల వివరాలపై అధ్యయనం చేసింది. అనంతరం మెజార్టీ నాయకుల అభిప్రాయం మేరకు పేర్లను ఫైనల్ చేశారు.
స్థానికంపై దిశా నిర్దేశం..?
కమిటీల ప్రకటన అనంతరం నేతలందరితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఓ ప్రత్యేక మీటింగ్ ను నిర్వహించేందుకు పార్టీ ప్లాన్ చేసింది. ఈ మీటింగ్ లో జిల్లా మంత్రులు, ఇన్ చార్జీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల టార్గెట్ ను ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయిలో ఎంపీటీసీ(MPTC), జడ్పీ టీసీ(ZPTC) లను గెలిపించే బాధ్యతలను ఇవ్వనున్నారు. ఇప్పటికే పలు సర్వేలను నిర్వహించిన పార్టీ, అభ్యర్ధుల ఎంపిక పై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ మీటింగ్ లో అభ్యర్ధుల సెలక్షన్ ప్రాసెస్ ను పీసీసీ చీఫ్ వివరించనున్నారు. దీంతో పాటు క్యాండిడేట్ కు సహకారం, ప్రతిపక్షాలకు చెక్ పెట్టడం వంటి అంశాలపై పార్టీ నుంచి సలహాలు, సూచనలను ఇవ్వనున్నారు.
Also Read: Teja Sajja: ప్రభాస్ కారణంగానే.. ‘మిరాయ్’ సక్సెస్‌పై హీరో తేజ సజ్జా స్పందనిదే!
90 శాతం స్థానాలు.?
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో 90 శాతం గెలవాలని పార్టీ లక్ష్యం పెట్టుకున్నది. ఇందుకోసం గత ఆరు నెలలుగానే గ్రౌండ్ వర్క్ చేస్తున్నది. గ్రామాలకు అవసరమైన మౌళిక వసతులు, ఇతర డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తూ ముందుకు సాగుతున్నది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) , బీజేపీ(BJP)కి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్(Congress) తన కసరత్తును చేస్తున్నది. రిజర్వేషన్లు ప్రకారమే ఎన్నికలు వస్తాయని, ఇందుకు నేతలంతా సహకరించాలని టీపీసీసీ లీడర్లను సమన్వయం చేయనున్నది.
Also Read: Illegal Constructions: తుంకుంట లో జోరుగా అక్రమ నిర్మాణాలు స్పందించని అధికారులు
