Telangana Congress: గ్రేటర్‌లో పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.
Telangana Congress ( image credit: twitter)
Political News

Telangana Congress: గ్రేటర్‌లో పెరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ప్రభుత్వం, పార్టీలో నూతనోత్సాహం!

Telangana Congress: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే సంఖ్య పెరిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌కు 64 సీట్లు లభించినప్పటికీ, జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క అభ్యర్థి కూడా గెలవలేదు. కానీ, కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన బై ఎలక్షన్‌లో హస్తం అభ్యర్థి గణేష్​ విజయం సాధించారు. ఈ తర్వాత జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపొందగా, జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ బీ ఫామ్‌పై గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పెరిగింది.

 Also Read: Telangana Congress: జూబ్లీహిల్స్‌లో కీలక అస్త్రాలు.. సీఎం ప్రచారంతో కాంగ్రెస్‌లో జోష్​

ముఖ్య నేతల్లో నూతనోత్సహం

దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (Congress Party) బలం గణనీయంగా పెరుగుతున్నది. ఈ రెండూ కీలక సెగ్మెంట్లు కావడంతో ముఖ్య నేతల్లో నూతనోత్సహం నెలకొన్నది. ప్రభుత్వం, పార్టీలోనూ సంతోషం ఏర్పడింది. మరోవైపు, ​గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేల బలం పెరగడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని ప్రభుత్వానికి రెండు విధాలుగా లాభదాయకంగా ఉంటుంది. స్థానిక సంస్థలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

ఎన్నిక ఏదైనా

వాస్తవానికి గ్రేటర్ పరిధిలో సాధారణంగా బీఆర్‌ఎస్, ఏఐఎం పార్టీల ఆధిపత్యం ఉండేది. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించింది. దీంతో కాంగ్రెస్‌కు ఎంఐఎం మద్దతు ప్రకటించింది. రెండు ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ మద్దతుతోనే కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఆకర్ష్’ ఆపరేషన్ ఫలితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీకి దగ్గరయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. అయితే స్పీకర్, సుప్రీం తీర్పు, నిర్ణయాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉంటే, ఆయా సెగ్మెంట్లలోనూ బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. అయినప్పటికీ, గెలవడం తేలికే అనే నమ్మకం పార్టీ నేతల్లో ఇప్పుడు కనిపిస్తున్నది.

 Also Read: Telangana Congress: కాంగ్రెస్ సాధించిన చారిత్రక విజయం.. కార్యకర్తలు నేతలు సంబురాలు

Just In

01

Bhatti Vikramarka: గత ప్రభుత్వ పాలకులు కవులను వాడుకుని వదిలేశారు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

India On Venezuela Crisis: ‘మీ భద్రతకు మా మద్దతు’.. వెనిజులా ప్రజలకు భారత ప్రభుత్వం కీలక సందేశం

Mahesh Kumar Goud: 20 ఏళ్లుగా కోట్ల మంది ఆకలి తీర్చింది ఉపాధి హామీ చట్టం : పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్!

Hydra: 3 వేల గ‌జాల పార్కు స్థ‌లాల‌ను కాపాడిన హైడ్రా!

Akhil Lenin: అఖిల్ ‘లెనిన్’ ప్రమోషన్ గురించి ఏం చెప్పాడంటే?.. అందుకే అయ్యగారు..