congress mlc mahesh kumar goud
Politics

Congress: ధర్నాలు చేసేది రైతులు కాదు.. బీఆర్ఎస్ నాయకులే

Farmers: రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగింది. బీఆర్ఎస్ చేపట్టిన ఈ ధర్నాపై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. వరి ధాన్యం విషయంలో ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు అనిపించడం లేదా? అని ఫైర్ అయ్యారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమం కోసం ఏ వెలగబెట్టారని నిలదీశారు. ఇప్పుడు ధర్నాలు చేస్తే రైతుల నుంచి ఆదరణ పొందవచ్చని అనుకుంటున్నారేమో అని సెటైర్ వేశారు. బీఆర్ఎస్ నాయకులే ధర్నాలు చేస్తున్నారని, అందులో రైతులు లేరని అన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం రైతులతో ఎలా వ్యవహరించిందో అన్నదాతలు అప్పుడే మరిచిపోయారని అనుకుంటున్నారా? అని మహేష్ గౌడ్ అన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసి కొట్టుకుంటూ తీసుకెళ్లారని, నేరెళ్ల రైతులు కేటీఆర్ కనుసన్నల్లో జరుగుతున్న ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు దాడులకు గురయ్యారని తెలిపారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించలేదని, వరి వేస్తే ఉరి అని కేసీఆర్ అన్నమాటను గుర్తు చేశారు. అలాంటి వారు సిగ్గు లజ్జా లేకుండా ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: ఆలస్యం.. అమృతం.. విషం! సాహితీ బాధితుల ఆవేదన

గత ప్రభుత్వంలో కన్నా కాంగ్రెస్ హయాం మార్చిలోనే ఐకేపీ సెంటర్లు తెరిచామని, గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తడిసిన ధాన్యానికీ మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నదని, ప్రజలు నాలుగు నెలల పాలనలో సంతోషంగా ఉన్నారని వివరించారు. కేసీఆర్ అప్పులతో చిప్ప చేతిలో పెట్టినా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు రేవంత్ రెడ్డి త్వరలో తీపికబురు చెబుతారని అన్నారు.

పార్లమెంటు ఎన్నికల్లో తుడుచుకుపెట్టుకపోతుందని గ్రహించే బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరతీసిందని, సీఎం రేవంత్ రెడ్డి చేయని వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 6 నుంచి 10 కిలోల తరుగు తీసి మిల్లర్లకు లబ్ది చేకూర్చి కమీషన్లు తిన్నారని ఆరోపించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!