Ramachandra Rao: మేం కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం
Ramachandra Rao (imagecredit:twitter)
Political News, Telangana News

Ramachandra Rao: మేం కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం: రాంచందర్ రావు

Ramachandra Rao: బీసీ రిజర్వేషన్లు అంటూ కాంగ్రెస్ డ్రామాలు ఆడిందని బీజేపీ స్టేట్ చీఫ్​ రామచందర్ రావు(Ramachandra Rao) పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల ఓట్లు పొందేందుకు కామారెడ్డి డిక్లరేషన్(Kamareddy Declaration) లో 42 శాతం రిజర్వేషన్లు అంటూ హడావిడి చేసిందని ఫైర్ అయ్యారు. ఆ తర్వాత న్యాయపరమైన చర్యలు సరైన విధంగా తీసుకోలేదన్నారు. ఇప్పుడు పార్టీ పరంగా అంటూ బీసీ(BC)లను ఆ పార్టీ మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఇతర పార్టీలపై మోపడం సరికాదన్నారు.

పంచాయతీ ఎన్నికలు

వాస్తవానికి రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణల ప్రకారం, స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఉండి సమావేశాలు నిర్వహించాల్సిందేనని, అలా ఉన్నప్పుడే 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుండి విడుదల అయ్యే అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ముగిసి 21 నెలలు దాటినా, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకవర్గాలు లేవన్నారు. దాంతో పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ.4 వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయన్నారు.ఇక భారతీయ జనతా పార్టీ(BJP) తరఫున కూడా పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చీఫ్​ రామచందర్ రావు తెలిపారు. బీసీలకు పెద్దపీట వేస్తామన్నారు.

Also Read: Hydraa: హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 52 ఫిర్యాదులు.. వీటిలో ఎక్కువ ఫిర్యాధులు వాటిపైనే..!

లెప్ట్ వింగ్ దేశం వదిలి వెళ్​లాలి..

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ‘కగార్’(Operation ‘Kagar’) ద్వారా దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టు చర్యలను నిర్మూలించే దిశగా నిర్ణయాత్మక చర్యలు జరుగుతున్నాయన్నారు. అనేక దశాబ్దాలుగా మావోయిస్టులు పేదలను, దళితులు, గిరిజనులను, పోలీసులను, పోలీస్‌ ఇన్ఫార్మర్‌ల పేరుతో పొట్టన పెట్టుకున్నారన్నారు. బీజేపీ(BJP), ఏబీవీపీ(ABVP) కార్యకర్తలపై అరాచకం సృష్టించారన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం లెప్ట్ వింగ్ ను దేశం వదిలి వెళ్​లేలా చేస్తుందన్నారు. తుపాకులు వదిలి మార్చి 31 లోపు లొంగిపోవాలని హెచ్చరిక జారీ చేశామని, ఆ తర్వాత కేంద్రం తన చర్యలను మరింత స్పీడప్ చేస్తుందన్నారు. ప్రజా జీవితంలో కలిస్తే మావోయిస్టులకు మంచిదని సూచించారు.

Also Read: Salary increments 2026: వచ్చే ఏడాది శాలరీ ఇంక్రిమెంట్లు ఎలా ఉంటాయో చెప్పేసిన కొత్త సర్వే

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?