Madhuyashki Goud (imagecredit:swetcha)
తెలంగాణ

Madhuyashki Goud: ఆదివాసీ గిరిజన యువత పై మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాక్యలు..?

Madhuyashki Goud: ఆదివాసి, గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్(Madhuyashki Goud)పేర్కొన్నారు. సోమవారం ఆయన రాజ్ భవన్ లో గవర్నర్ అధ్యక్షత న నిర్వహించిన ఆదివాసి గిరిజన యువత ఇంట్రాక్షన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

మేరా యువ భారత్..

ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో 17వ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం(Tribal Youth Exchange Program)లో భాగంగా వారం రోజులపాటు నగరంలో జరిగిన గిరిజన యువత సమ్మేళనంలో చత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు చెందిన చెందిన యువతీ యువకులు పాల్గొనడం సంతోషంగా ఉన్నదన్నారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ గిరిజన ఆదివాసి ప్రాంతాలలో రోడ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, తాగునీరు లాంటి కనీస సదుపాయాలు లేకపోవడం బాధాకరమన్నారు. సామాజిక ఆర్థిక అణిచివేత కారణంగా చాలామంది యువత నక్సలిజం వైపు వెళ్తున్నారన్నారు.

Also Read: Keerthy Suresh: యూనిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమితులైన కీర్తీ సురేశ్..

శ్రమకు తగ్గట్టు ఫలితం

ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధి జరిగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గిరిజన ప్రాంతాలలో అనేక వనరులు ఉన్నాయని, కానీ వారికి సరైన సదుపాయాలు, సంపదలో వాటా దక్కకపోవడం బాధాకరమన్నారు. అధికారంలో ఎవరున్నా.. ఆదివాసి యువత తమ హక్కుల కోసం, తమ శ్రమకు తగ్గట్టు ఫలితం కోసం ప్రశ్నిస్తునే ఉండాలని సూచించారు. ఆదివాసి యువతకు ఉపాధి, ఉద్యోగాలు, అన్ని రంగాలలో అవకాశాలు కల్పించినప్పుడే వారి అభ్యున్నతికి దోహదం చేసిన వారమవుతామన్నారు. ఆదివాసి గిరిజన యువత ఉన్నత స్థానాలకు ఎదిగి తాము పుట్టి పెరిగిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

Also Read: IBomma: ఇక ఐ బొమ్మ బప్పంకు తెరపడినట్టే.. వెబ్ సైట్లు క్లోస్ చేసిన పోలీసులు

Just In

01

Hidma Encounter: భారీ ఎన్ కౌంటర్.. కరుడుగట్టిన మావోయిస్టు హిడ్మా హతం

Adilabad Cold Wave: డేంజర్ బెల్స్.. చలికి అల్లాడుతున్న ఆదిలాబాద్..!

Ramulu Suicide Case: కేశపట్నంలో బలవన్మరణం బాధితులకు న్యాయం.. నిందితుల రిమాండ్‌..!

Gold Price Today: గుడ్ న్యూస్.. ఈ రోజు భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్?

BRS vs Kavitha: గులాబీకి రాజకీయ ప్రత్యర్థిగా ఇక జాగృతి.. కవిత టార్గెట్‌గా బీఆర్ఎస్ అస్త్రాలు సిద్ధం