Bhatti Vikramarka ( IMAGE CREDIT: SWETCHA REPORTER)
Politics

Bhatti Vikramarka: నవీన్ పీజేఆర్‌లా పనిచేస్తారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ప్రజలకు మంత్రుల విజ్ఞప్తి!

Bhatti Vikramarka: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజల నిజమైన సేవకుడని, ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, (Bhatti Vikramarka)  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విజ్ఞప్తి చేశారు. నవీన్ గెలిస్తే, దివంగత నేత పీజేఆర్ తరహాలో నియోజకవర్గానికి అంకితభావంతో పనిచేస్తారని వారు హామీ ఇచ్చారు.

Also ReadBhatti Vikramarka: జీసీసీలకు క్యాపిటల్ హైదరాబాద్.. సమానత్వంతో కూడిన వృద్ధి లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తోంది

వీరంతా యూసుఫ్‌గూడలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ 30వేల నుంచి 50 వేల మధ్య మెజారిటీతో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఫేక్ సర్వేలు చేసుకుని బీఆర్‌ఎస్ భ్రమల్లో ఉందని, ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తోందని నేతలు విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు కలిసి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని బలి చేశారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ గెలుస్తుందన్న భయంతోనే తమ పార్టీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గత ప్రభుత్వ హయాంలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు 

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేపట్టిన రెండేళ్ల పాలనను చూసి ఓటు వేయాలని వారు కోరారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కానీ తాము పేదలందరికీ వాటిని పంచుతున్నామని గుర్తు చేశారు. గత మూడు పర్యాయాలు భారాసకు చెందిన వ్యక్తిని గెలిపించినప్పటికీ, ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఫేక్ వీడియోలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని కోరారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, సినీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉందని నేతలు స్పష్టం చేశారు.

Also Read: Bhatti Vikramarka: మహిళలకు కీలక సందేశం ఇచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Just In

01

Bigg Boss Telugu 9: హౌస్‌లో ‘మండే’ మంటలు మొదలయ్యాయ్.. ఇంకెవరూ ఆపలేరు!

Swathi murder case: వీడిన స్వాతి మర్డర్ మిస్టరీ.. వెలుగులోకి సంచలన నిజాలు!

Air Pollution Protest: ఊపిరి పీల్చలేకపోతున్నాం, రక్షించండి.. రోడ్డెక్కిన దిల్లీ జనం.. పిల్లలు కూడా అరెస్ట్?

Bandi Sanjay: మజ్లిస్ అండతోనే కిడ్నాప్, అత్యాచారాలు.. కేంద్ర మంత్రి బండి సంచలన కామెంట్స్!

KTR: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ ఓటమి ఖాయం..కేటీఆర్ కీలక వ్యాఖ్యలు