Daseoju Sravan: 24 నెలల కాంగ్రెస్ పాలన ను ఆర్థిక విధ్వంసం అని, లైసెన్సులు లూటీగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అభివర్ణించారు. శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ నాశనం అయిందని, లిక్కర్ లైసెన్సుల దందా జరుగుతోందని ఆరోపించారు. మూసి పేరుతో 1.5 కోట్ల లక్షలకు స్కెచ్ వేశారని, ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా కు తెరదీశారని, హెచ్సీయూ భూములపై కన్ను వేసి పర్యావరణ విధ్వంసం చేశారని, మిస్ వరల్డ్ పేరుతో 2000 కోట్లు నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇవన్నీ ప్రశ్నిస్తే నేరమా? ఇదే ప్రజాస్వామ్య పాలన అని ప్రభుత్వాన్ని నిలదీశారు.
కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయం
కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయం ₹1.24 లక్షల నుంచి ₹3.17 లక్షలకు పెరిగిందని, GSDP ₹4 లక్షల కోట్ల నుంచి ₹15 లక్షల కోట్లకు చేరిందని, వ్యవసాయ ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు పెరిగిందని అన్నారు. రైతుబంధు, తాగునీరు, నిరంతర విద్యుత్, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, మానవతా పథకాలతో కేసీఆర్ తెలంగాణను నిర్మించిన బిల్డర్ అయితే, రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అమ్ముకుంటున్నరని ఆరోపించారు.
Also Read: Sangareddy: ఆసుపత్రికి బయలుదేరిన పెద్దాయన.. మధ్యలోనే అనూహ్య రీతిలో మృత్యువు
ఎందుకు భయపడుతున్నారు
సర్పంచ్ ఎన్నికల్లో 6,000 మందికి పైగా మీ మద్దతుదారులు ఓడిపోయినా మౌనం పాటించిన మీరు, జెడ్పీటీసీ–ఎంపీటీసీ ఎన్నికలకు పార్టీ గుర్తులు పెట్టడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. సింహం మౌనాన్ని చూసి ఎగిసిపడవద్దని, అది తుఫానుకు ముందు నిశ్శబ్దమని హెచ్చరించారు. కేసీఆర్ ఒక్కసారి బయటకు వస్తే, మీ అరుపులు ప్రజల ఆక్రోశంలో కొట్టుకుపోతాయని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు కాక, రైతుబంధు రాక, రుణమాఫీ లేక ప్రజలు రగిలిపోతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తుది తీర్పు చెబుతారని స్పష్టంగా హెచ్చరించారు. ఇప్పటికైనా మీ భాష మార్చుకోండి, పాలన మార్గం మార్చుకోండి..లేదంటే ప్రజలు తమ ఓటుతో మీ తలరాతను మార్చేస్తారని ఆయన అన్నారు.
Also Read: Sangareddy: ఆసుపత్రికి బయలుదేరిన పెద్దాయన.. మధ్యలోనే అనూహ్య రీతిలో మృత్యువు

