BJP War
Politics, లేటెస్ట్ న్యూస్

BJP: బీజేపీకి కొత్త తలనొప్పి.. డీకే అరుణ వర్సెస్ శాంతికుమార్

BJP: కాషాయ పార్టీకి మరో కొత్త తలనొప్పి వచ్చిపడింది. నేతల మధ్య కోల్డ్ వార్ మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటల రాజేందర్‌ మధ్య జరగ్గా తాజాగా మరో ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు షురూ అయింది. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొన్న కార్యక్రమంలోనే ఇరు వర్గీయులు విమర్శలు చేసుకోవడంతో పాటు బాహాబాహీకి దిగేందుకు యత్నించడం చర్చనీయాంశంగా మారింది. పాలమూరు ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మధ్య ఉన్న కోల్డ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పాలమూరును తన ఇలాకాగా చెప్పుకునే డీకే అరుణకు వ్యతిరేకంగా మరో వర్గం గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం ఆమె పరువు, ప్రతిష్టకు సవాల్‌గా మారాయి. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న ఆమెకు ఈ అంశం ఏమాత్రం మింగుడుపడటంలేదని తెలుస్తోంది.

ఏకఛత్రాధిపత్యం!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు డీకే అరుణ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం, పలుకుబడితో గతంలోనే ఎన్నో పదువులు ఆమెను వరించాయి. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అరుణ తన మార్క్‌ను చూపారని టాక్. అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించిందని చెబుతుంటారు. మహబూబ్ నగర్ నుంచి టికెట్ ఆశించిన శాంతికుమార్‌కు దక్కకపోవడంలో ఆమె పాత్ర ఉందని వినికిడి. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ అభ్యర్థులకు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థులకు అండగా ఉన్నారని, వారి గెలుపులో సైతం కీలకంగా వ్యవహరించారని ప్రచారం జరిగింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందువల్లే పార్టీ బలహీనంగా మారిందనే ఉద్దేశ్యంతోనే శ్రేణులు డీకేకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు సమాచారం.

Read Also- Tele MANAS: బాధితుల భద్రతకు ‘టెలీ మానస్’.. దీని గురించి మీకు తెలుసా?

సీన్ మారేదెప్పుడు?

తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ టాస్క్‌గా జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన తొలుత ఉమ్మడి నల్లగొండ జిల్లా పర్యటన అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కానీ నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా పార్టీ పటిష్టమవ్వడం సంగతి పక్కన పెడితే ప్రజల్లో మరింత పలచనయ్యేలా మారుతుండటం శ్రేణులను ఆందోళనను కలిగిస్తోంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి చేరుకోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే చెబుతున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కూడా మహబూబ్‌నగర్. గతంలో రేవంత్ రెడ్డికి, డీకే అరుణకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. సీఎం సొంత జిల్లా అవ్వడంతో లోకల్ బాడీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. ఆ జిల్లాలో అన్ని స్థానాలను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీకి నేతల మధ్య ఆధిపత్య పోరు శాపంగా మారే అవకాశముంది. ఈనేపథ్యంలో ఇరువురు నేతల మధ్య పోరు కాంగ్రెస్ కు కలిసొచ్చే అవకాశముందనే చర్చ జరుగుతోంది. మరి బీజేపీలో ఈ సీన్ మారుతుందా? లేక నేతల మధ్య ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగుతుందా? అనేది చూడాలి.

Read Also- Ilaiyaraaja: మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు బిగ్ షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు!

Just In

01

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..