Cm Revanth Reddy Aim Is To Strengthen Congress party Energy
Politics

Target 14 : టార్గెట్ 14

– చేవెళ్ల నేతలతో సీఎం రేవంత్ సమావేశం
– పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం
– ఏప్రిల్ 6 లేదా 7న తుక్కుగూడలో సభ
– జాతీయస్థాయి గ్యారెంటీల ప్రకటన
– రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం
– సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్న సీఎం

CM Revanth reddy Target 14 : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని, ప్రస్తుత పరిణామాలను బట్టి రాజకీయ పండితులు, ఇతర పార్టీలు ఓ అంచనాకొచ్చాయి. కీలక నేతలంతా జంప్ అవుతుండడం ఆపార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఫైట్ ఉంటుందని అంటున్నారు. అయితే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించేలా హస్తం నేతలు వ్యూహరచనలో ఉన్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ 14గా ముందుకు కదులుతున్నారు. ఈక్రమంలోనే నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో 14 గెలవాలనే పట్టుదలతో ఉన్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే అధిష్టానం అభ్యర్థులను ఎంపిక చేస్తుందని చెప్పారు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి నియోజకవర్గాలకు ఒకదానికొకటి సంబంధం ఉందన్న ఆయన, అన్ని రకాలుగా ఆలోచించే చేవెళ్లలో రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్‌లో దానం నాగేందర్‌ని పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిందన్నారు. ‘‘పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు వంద రోజుల పరిపాలనకు రెఫరెండం. తెలంగాణలో 14 పార్లమెంట్ స్థానాలు గెలిచి సోనియమ్మకు కృతజ్ఞత చెబుదాం. పదేళ్లు మోడీ ప్రధానిగా ఉన్నా ఏం చేశారు? ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేయలేదు. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదు.

Read Also : కల్వకుర్తికి మహర్దశ..

బుల్లెట్ ట్రైన్ గుజరాత్‌కు తీసుకెళ్లిన మోడీ వికారాబాద్‌కు ఎంఎంటీఎస్ రైలు తీసుకురాలేదు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసుకున్న మోడీ మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు. రీజనల్ రింగ్ రోడ్డు రాకుండా బీజేపీ ఎందుకు మోకాలడ్డుతోంది? ఏం చూసి మూడోసారి మోడీకి ఓటు వేయాలని బీజేపీ నేతలు అడుగుతున్నారు? వారి వ్యవహారం పెళ్లి పెద్దను చూసి పిల్లనివ్వాలన్నట్లుంది. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఇది చక్కని అవకాశం.

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది’’ అని అన్నారు రేవంత్ రెడ్డి. కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ వేల కిలోమీటర్లు నడిచారని గుర్తు చేశారు. పార్టీకి అండగా నిలబడి సోనియమ్మ నాయకత్వానికి బలపరచాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచించారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు గ్యారెంటీలను ప్రకటించుకున్నామని, మళ్లీ అక్కడే ఏప్రిల్ 6 లేదా 7న జాతీయస్థాయి గ్యారెంటీలను ప్రకటించుకోబోతున్నామని వివరించారు. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు శంఖారావం పూరించబోతున్నామని, ఈ జన జాతర సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?