Telangana CM Revanth reddy Mass Warning To KCR
Politics

Revanth Reddy: ‘బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ.. రిజర్వేషన్ల రద్దే ఎజెండా’

BJP: పదేళ్లలో 20 కోట్లు ఉద్యోగాలిస్తామని 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే మోడీ ఇచ్చారని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోసం చేశారని కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. జన్ ధన్ ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని కబుర్లు చెప్పి పదేళ్లయినా 15 పైసలు కూడా వేయలేదని ఆగ్రహించారు. బీజేపీ వాళ్లు నమో అంటున్నారని, నమో అంటే నమ్మించి మోసం చేయడం అని అన్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బ్రిటీష్ జనతా పార్టీ అని భాష్యం చెప్పారు. రిజర్వేషన్లను రద్దు చేయడానికే బీజేపీ 400 సీట్లు కావాలని అనుకుంటోందని ఆరోపించారు.

వ్యాపారం ముసుగులో బ్రిటీషర్లు ఇండియాను సూరత్ నుంచే ఆక్రమించారని, బీజేపీ ఈస్టిండియా కంపెనీని ఆదర్శంగా తీసుకుందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అని, వాళ్ల ఎజెండా బ్రిటీష్ ఎజెండా అని, రిజర్వేషన్లు రద్దు చేయడం వారి ఎజెండా అని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తుననదని, కాంగ్రెస్ ఎజెండా రాజ్యాంగాన్ని కాపాడటం, రిజర్వేషన్లను అమలు చేయడం అని వివరించారు. అందరి అభిప్రాయాలను సేకరించే రంజిత్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపామని తెలిపారు.

Also Read: Lok Sabha Elections: మూడు పార్టీల అభ్యర్థులు వీరే.. ఫుల్ లిస్ట్

రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోడీ, అమిత్ షాలు చెబుతున్నారని, దీనికి బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబానికి గొప్ప చరిత్ర ఉన్నదని, ఆయన దాన్ని కలుషితం చేయొద్దని హితవు పలికారు.

ఇచ్చిన హామీలను అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్ అమలు చేయలేదని, అందుకే కారు కార్ఖానాకు పోయిందని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. కార్ఖానాకు వెళ్లిన కారు ఇక సరాసరి తూకానికేనని ఎద్దేవా చేశారు. కారు పనైపోయింది కాబట్టే ఆయన బస్సు వేసుకుని బయల్దేరాని సెటైర్ వేశారు. అసెంబ్లీలో చర్చ అంటే పారిపోయిన కేసీఆర్ టీవీ చానెల్‌లో నాలుగు గంటలు కూర్చున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కడిగేస్తుందనే భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదని అన్నారు.

Just In

01

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు