Candidates List: లోక సభ నాలుగో విడత పోలింగ్ మే 13వ తేదీన జరగనుంది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు ఈ విడతలోనే జరుగనున్నాయి. నాలుగో విడత అభ్యర్థుల నామినేషన్ల గడువు గురువారంతో ముగిసింది. దీంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు 17 స్థానాల్లో బరిలోకి దింపిన అభ్యర్థుల జాబితాను పరిశీలిద్దాం.
ఆదిలాబాద్ (ఎస్టీ):
కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ, బీజేపీ అభ్యర్థి గోడం నగేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు
పెద్దపల్లి (ఎస్సీ):
కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
కరీంనగర్:
కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, బీజేపీ అభ్యర్థి బండి సంజయ్, బీఆర్ఎస్ అభ్యర్థి బీ వినోద్ కుమార్
నిజామాబాద్:
కాంగ్రెస్ అభ్యర్థి టీ జీవన్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
జహీరాబాద్:
కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్, బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్, బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్
మెదక్:
కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి సీ వెంకట్ రామ్ రెడ్డి
మల్కాజ్‌గిరి:
కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి
సికింద్రాబాద్:
కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్, బీజేపీ అభ్యర్థి జీ కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు గౌడ్
హైదరాబాద్:
కాంగ్రెస్ అభ్యర్థి వలిఉల్లా సమీర్, బీజేపీ అభ్యర్థి మాధవీలత, బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్
చేవెళ్ల:
కాంగ్రెస్ అభ్యర్థి జీ రంజిత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్
మహబూబ్‌నగర్:
కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి
నాగర్‌కర్నూల్ (ఎస్సీ):
కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్, బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్
నల్గొండ:
కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ కుందూరు, బీజేపీ అభ్యర్థి సైది రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల క్రిష్ణా రెడ్డి
భువనగిరి:
కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్
వరంగల్ (ఎస్సీ):
కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్
మహబూబాబాద్ (ఎస్టీ):
కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, బీజేపీ అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్, బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత
ఖమ్మం:
కాంగ్రెస్ అభ్యర్థి రామసహయం రఘురాం రెడ్డి, బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు