cm revanth reddy
Politics

CM Revanth: వరి వేస్తే ఉరి కాదు.. వరి వేస్తే సిరి!

CM Revanth: పదేండ్ల బీఆర్ఎస్ (BRS) పాలనలో రైతులకు జరిగిన అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుర్తు చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో పర్యటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, జూపల్లి కృష్ణారావుతో కలిసి ‘‘ఇందిర సౌర గిరి జల వికాసం’’ పథకాన్ని ప్రారంభించారు. రూ.12,600 కోట్లతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో యూనిట్‌కు రూ.6 లక్షల చొప్పున వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు లాభం చేకూరనుంది. ముందుగా సీతారామాంజనేయ ఆలయాన్ని సందర్శించిన సీఎం, తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ, నల్లమల బిడ్డగా ఈ గడ్డపై నుంచి మాట్లాడుతుంటే గుండె ఉప్పొంగుతున్నదని చెప్పారు.

అభివృద్ధే లక్ష్యం

అచ్చంపేట (Achampet) నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎన్నికల సమయంలో మాట ఇచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు అధికారులకు సూచనలు చేశానని, నియోజకవర్గంలో రైతులందరికీ సోలార్ పంపు సెట్లు అందిస్తామన్నారు. వంద రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.60 వేల కోట్లను రైతుల కోసం ఖర్చు చేసినట్టు వివరించారు.

Read Also- Hyderabad: ఓరి నీ దుంపతెగ.. మహిళ ‘వేలు’ చూపించిందని కొరికేశాడు!

బీఆర్ఎస్‌పై నిప్పులు

పోడు భూములపై పోరాటం చేసిన వారిని జైల్లో పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే, సోలార్ పంపు సెట్లను అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదని సీఎం రేవంత్ అన్నారు. సన్నాలు పండించే రైతులకు మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. వరి వేస్తే ఊరే అనే పరిస్థితుల నుంచి వరి వేస్తే సిరి అనే పరిస్థితులను కల్పించామని తెలిపారు. పేదలందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తూ వారి ఆత్మగౌరవం పెంచామని, రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మందికి అందిస్తున్నామన్నారు. అదానీ, అంబానీలతో పోటీ పడేలా ఆడబిడ్డలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామని వివరించారు. తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడా లేని విధంగా ఏడాదిలో 60 వేల ఉద్యోగ నియామకాలను భర్తీ చేసినట్టు తెలిపారు. కొంతమంది తమ అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శలు చేశారు. కడుపునిండా విషం పెట్టుకుని విష ప్రచారం చేసే వారిని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. ‘‘పేదల ఆకలి తీర్చే సన్న బియ్యం మేమేం చేస్తున్నామో గుర్తు చేస్తుంది. పాసు పుస్తకాలు చూసినప్పుడల్లా రైతులుకు రుణమాఫీ చేసిన రేవంతన్న గుర్తొస్తాడు.
బస్సులో ఉచిత ప్రయాణం చేసిన ఆడబిడ్డలకు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్న పేదలకు మా ప్రభుత్వం చేసే మంచి పనులు ఎప్పటికీ గుర్తుంటాయి. ఎవరెన్ని కుట్రలు పన్నినా, తప్పుడు ప్రచారాలు చేసినా ప్రభుత్వ పథకాలే ప్రజలకు నిజాలను చెబుతాయి. అలాంటివారికి ప్రజలే బుద్ధి చెబుతారు’’ అని వ్యాఖ్యానించారు.

పథకం ప్రారంభంపై సర్వత్రా హర్షం

‘‘ఇందిర సౌర గిరి జల వికాసం’’ పథకం ప్రారంభించడం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోలార్ పంపు సెట్లతోపాటు పొలంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పరిసర ప్రాంతాల గిరిజనులకు లబ్ధిదారులు పథకంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ పంపు సెట్ల స్థానంలో సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయాలని సూచనలు చేశారు. వంద రోజుల్లో రైతులందరికీ సోలార్ పంపు సెట్ల ఏర్పాటు పూర్తి చేయాలని, ఇందుకోసం స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు చెప్పారు.

Read Also-KTR on CM Revanth: పాతబస్తీ సంఘటనపై కేటీఆర్ ఆరా.. అవి ఉంటే ప్రాణ నష్టం తగ్గేది!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు