Man Bites Women Finger
క్రైమ్, తెలంగాణ

Hyderabad: ఓరి నీ దుంపతెగ.. మహిళ ‘వేలు’ చూపించిందని కొరికేశాడు!

Hyderabad: కొన్ని చిత్రవిచిత్రాలు, అంతకుమించి నేరాలు, ఘోరాలు మనం సినిమాల్లో మాత్రమే చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అంతకుమించే మన చుట్టుపక్కలే జరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే అబ్బో ఎన్నెన్ని సంఘటనలో చెప్పలేం. ఇదిగో భాగ్యనగరంలోని మధురానగర్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు పెద్ద చర్చకే దారితీసింది. అంతకుమించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. చిట్టీ డబ్బు విషయంలో ఘర్షణ చోటుచేసుకోగా ఓ మహిళ వేలు కొరికాడో వ్యక్తి. వేలు ఊడిపోయి కిందపడింది. వేలు పట్టుకుని ఆస్పత్రికి బాధితురాలు పరుగులు తీసింది. అయితే వేలు అతికించలేమని వైద్యులు చెప్పడంతో సదరు మహిళ నివ్వెరపోయింది. మరోవైపు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన మధురానగర్‌లోని జవహర్ నగర్‌లో జరిగింది. అసలు ఎందుకీ గొడవ? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం…

Women Finger

 

Read Also- YSRCP: సీన్ రివర్స్.. స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో వైసీపీ విజయదుందుభి..

అసలేం జరిగింది?
జవహర్‌నగర్‌కు చెందిన సుజిత ఇంట్లోని పెంట్ హౌజ్‌లో మూడేళ్లుగా మమత అద్దెకు ఉంటున్నారు. పరిచయం, నమ్మకం ఉండటంతో మమత వద్ద సుజిత చిట్టీలు వేసేవారు. అయితే.. మమతకు రూ.30 వేలు చిట్టీ డబ్బులు సుజిత ఇవ్వాల్సి ఉంది. అయితే.. ఇటీవల మమత ఆ పెంట్ హౌజ్‌‌ను ఖాళీ చేసి తన ఫ్రెండ్ సుప్రియకు ఇప్పించారు. ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. వారం రోజుల్లోనే ఎవరికి చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి సుప్రియ వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే చిట్టీ డబ్బులు వసూలు చేయడానికి సుజిత ఇంటికి.. తన భర్త హేమంత్‌తో కలిసి మమత వెళ్లారు. అయితే.. ఇంటి అద్దె చెల్లించకుండా సుప్రియ వెళ్లిందని, ‘మీ ఫ్రెండే కదా? మీరే కదా ఇక్కడికి తెచ్చింది.. మీరే అద్దె డబ్బు ఇవ్వాలి’ అని సుజిత పట్టుబట్టారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. గొడవ పడొద్దని సుజిత తల్లి లత (45) సర్ది చెబుతూ అడ్డుపడ్డారు. వేలు చూపించి వార్నింగ్ ఇస్తున్నట్లుగా మాట్లాడటంతో హేమంత్ ఆగ్రహానికి లోనయ్యాడు. దీంతో.. లత కుడి చెయ్యి చూపుడు వేలిని హేమంత్ కొరికేశాడు. దీంతో వేలు ఊడి కింద పడింది. కుయ్యో మర్రో అంటూ వెంటనే ఆ వేలు తీసుకొని లత, సుజిత ఇద్దరూ ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆ వేలును పరిశీలించిన వైద్యులు.. అతికించలేమని చెప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు హేమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మధురానగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Hemanth

బూతులు తిట్టి.. కొట్టి..!
సోమవారం ఉదయమే ఫుల్‌గా తాగొచ్చిన హేమంత్.. సుజిత, లతలపై దాడికి తెగబడ్డాడు. అడ్డొచ్చిన సుజిత కుమారుడు, కుమార్తై పైనా పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అసలు మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే వేలు చూపించిందని పచ్చి బూతులు తిట్టి.. కొట్టి వేలు కొరికేశాడు దుండగుడు. పక్కనున్న భార్య ఇంకా కొట్టు.. కొట్టు అని చెప్పడంతో మరింత రెచ్చిపోయిన హేమంత్ సుజిత, లత, ఇద్దరు పిల్లలు ఇలా ఎవర్నీ వదలకుండా దాడి చేశాడు. కాగా, మమతకు హేమంత్ రెండో భర్త. రెంట్‌కు రూమ్‌ అడిగినప్పుడు వారు నిరాకరించడంతో అప్పట్నుంచి సుజితపై కోపం పెంచుకున్నట్లుగా తెలుస్తున్నది. వాస్తవానికి చిట్టీ డబ్బులు 20 తారీఖు ఇస్తామని సుజిత చెప్పినప్పటికీ.. ఒక్క రోజు ముందే వచ్చి నానా రచ్చ చేసి ఇలా కూృరంగా ప్రవర్తించి, వేలు కొరికేశాడని బాధితులు చెబుతున్నారు. ప్రస్తుతం వేలు కొరికేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మరీ ఇంత వైలెంట్‌గా ఉన్నాడేంట్రా బాబూ.. అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఆ కామెంట్లు గురించి మాటల్లో చెప్పలేం అంతే..!

Man Women Fight

Read Also- Mahesh Babu Family Covid-19: షాకింగ్ న్యూస్.. మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా పాజిటివ్.. పోస్ట్ వైరల్

 

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం