CM Revanth Reddy (imagecredit:swetcha)
Politics

CM Revanth Reddy: నాపై కక్ష ఉంటే నాపైనే చూపండి మేలు జరిగే పనులు అడ్డుకోవద్దు.. సీఎం రేవంత్

CM Revanth Reddy: రాజకీయాల పరంగా నాపైనే ఏమైన కక్ష ఉంటే నాపైనే చూపించాలే గానీ, ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్ లో అక్కడి ప్రభుత్వం సబర్మతి నదినీ, ఢిల్లీలో సర్కారు ఎమున నదీని, ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ సర్కారు గంగ నదులను ప్రక్షాళన చేసుకుంటే గొప్పా, తెలంగాణ సర్కారు మూసీ నదీని ప్రక్షాళన చేసుకుంటే తప్పా? అని ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. మోడీ చేస్తే గొప్ప ఎట్లా అవుతది, తెలంగాణ సర్కారు చేస్తే తప్పు ఎట్లా అవుతదో మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. సర్కారు ఆస్తులైన చెరువులు, కుంటలు, నాలాలను పరిరక్షిస్తున్న హైడ్రాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్‌ను, వెబ్ సైట్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. అంతేగాక, హైడ్రా కబ్జాల నివారణ, డిజాస్టర్ రెస్క్యూ నిర్వహణ కోసం అదనంగా సమకూర్చిన 55 స్కార్పియో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహానాలను, నాలుగు ఇన్నోవా క్లాస్ వాహానాలను, మరో 21 డీఆర్ఎఫ్ బైక్ లను సీఎం జెండా ఊపి ప్రారంభించారు

401 చెరువులు కబ్జాల పాలు అయ్యాయి

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ చారిత్రక హైదరాబాద్ నగరంలో నిజాం హయాంలో 940 చెరువులుండగా, వీటిలో 401 చెరువులు కబ్జాల పాలయ్యాయని, వాటి పునరుద్దరణకు సంబంధించి సమైఖ్య రాష్ట్రంలో ప్రత్యేక రాష్టంలోనూ ఇప్పటి వరకు ఏ పాలకులు ఆలోచించని విధంగా హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడుకోవటంతో పాటు ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు నగరాల మాదిరిగా చిన్న పాటి వర్షానికే హైదరాబాద్ నగరం నీట మునగకుండా ఉండేందుకు ఎంతో ముందు చూపుతో హైడ్రాను తీసుకువచ్చామని వివరించారు. ఆక్రమణలను ప్రోత్సహించే వారు, మూసీ ప్రక్షాళను వ్యతిరేకించే వారు నేడు హైడ్రా చర్యలపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వారికే హైడ్రా అంటేనే భయం పట్టుకుందని సీఎం విమర్శించారు.

Also Read: India And Pak Tension: ఏ క్షణమైనా పాక్‌పై భారత్ దాడి.. ఈలోపే కీలక పరిణామం

మూసీ ధర్గంధం మధ్య బతుకుతున్న పేదల జీవితాల్లో వెలుగులు రావద్దా? ఎందుకు మూసీ సుందరీకరణ ను, హైడ్రా చర్యలను వ్యతిరేకిస్తూ, రియల్ ఎస్టేట్ రంగం పడిపోతుందంటూ తప్పుడు ప్రచారం చేసేందుకు దిగజారరని సీఎం విమర్శించారు. మరి కొందరు నేతలు మూసీ నిర్వాసితులను తొలగించరాదని, అడ్డుపడుతూ మూసీ పరివాహక ప్రాంతంలో పడుకుంటామని చెప్పి, మూడంతస్తుల భవనాల్లో నిద్ర చేశారని, ఇలాంటి వారిని పేదలకు న్యాయం చేసేందుకు వీలుగా మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రతి అయిదు కిలోమీటర్లకు ఓ క్లస్టర్ గా ఏర్పాటు చేసి, పేదలకు అపార్ట్ మెంట్లు కట్టి ఇచ్చేందుకు ముందుకు రావాలని స్వయంగా తానే అసెంబ్లీ సాక్షిగా ఆహ్వానించినా, వారు ముందుకు రావటం లేదని, అసలు వారి బాధ ఏమిటీ? అంటూ సీఎం ప్రశ్నించారు.

ఆక్రమణదారుల నివారణ లక్ష్యంగానే హైడ్రా ఏర్పాటు

చెరువులు, కుంటలు, నాలాల కబ్జాలను నియంత్రించటంతో పాటు డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిర్వహించటంతో పాటు కబ్జాలకు పాల్పడే ఆక్రమణదారుల నివారణ లక్ష్యంగానే హైడ్రా ను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. కాలుష్యాన్ని నియంత్రికపోవడంతో ఢిల్లీలో పార్లమెంట్ నుంచి పాఠశాల వరకు సెలవులు ప్రకటించుకోవల్సిన పరిస్థతి తలెత్తిందని, కాలుష్యాన్ని అరికడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోవటం వల్లే ఢిల్లీ లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని, మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం లేని నగరాలుగా మారుతున్నాయని, ఈ పరిస్థితి హైదరాబాద్ నగరానికి రావొద్దన్న ఉద్దేశ్యంతోనే తాము మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుడితే కొందరు రాజకీయ నాయకులు కడుపు మంటతో మాట్లాడుతున్నారని విమర్శించారు.

ప్రకృతిని మనం కాపాడుకుంటేనే ప్రకృతి మనల్ని కాపాతుందని, ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్ లోనూ ఢిల్లీ లాంటి పరిస్థితులే తలెత్తుతాయని సీఎం వ్యాఖ్యానించారు. దశాబ్దాల కాలం క్రితం కంచె గచ్చిబౌలీలోని నాలుగు వందల ఎకరాల సర్కారు స్థలాన్నిప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తే, తాము సుప్రీం కోర్టులో కేసు వేసి, ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని, అక్కడ రూ. లక్ష కోట్ల పెట్టుబడితో ఐటీ హాబ్ ను ఏర్పాటు చేస్తే ప్రత్యేక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సర్కారు ప్రయత్నిస్తే, అక్కడ వన్యప్రాణులున్నాయని తప్పడు ప్రచారం చేస్తు అడ్డుకుంటున్నారని సీఎం ఫైర్ అయ్యారు.

బతుకమ్మ కుంట పరిరక్షణకు మాజీ ఎంపీ పోరాటం

బతుకమ్మ కుంట పరిరక్షణకు మాజీ ఎంపీ వీహెచ్ 25 ఏళ్లుగా పోరాటం చేశారని, చివరకు ఎట్టకేలకు అక్కడ కుంట ఉన్నట్లు హైడ్రా టెక్నికల్ గా గుర్తించిందని, రేపు రాబోయే బతుకుమ్మ పండుగను ఆ కుంటలోనే నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. హైడ్రా సరి కొత్త పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకుని మరింత బలోపేతమైందని, కానీ ఆక్రమణల విషయంలో హైడ్రా పేదల పట్ల కాస్త మానవీయంగా వ్యవహారించాలని, ఆక్రమణలకు పాల్పడే పెద్దల పట్ల కఠినంగా వ్యవహారించాలని, ఈ విషయంలో మరో మాట ఉండబోదని సీఎం స్పష్టం చేవారు.

హైడ్రా, హైడ్రాలో విధులు నిర్వహిస్తున్న కమిషనర్ మొదలుకుని జవాను వరకు హైడ్రా అంటే ఓ ఉద్యోగం మాత్రమే కాదని, ఇదో సామాజిక బాధ్యతగా గుర్తించాలని సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు అనీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, మున్సిపల్ శాఖ సెక్రటరీ ఇలంబర్తి, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాధ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Khans of Bollywood: ‘ఆపరేషన్‌ సింధూర్’పై ఒక్క ఖాన్ కూడా స్పందించలే.. వీళ్లు మనకి అవసరమా?

 

Just In

01

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు