Khans of Bollywood: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారానికి దిగింది. ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరుతో మంగళవారం రాత్రి పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన వారికి న్యాయం చేసేందుకే ఈ దాడులు చేసినట్లు కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వెల్లడించారు. దీంతో, వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియా వేదికగా భారత సైన్యానికి జేజేలు పలుకుతున్నారు. ‘జైహింద్’, ‘భారత్ మాతా కీ జై’, ‘మేమంతా మీ వెంటే ఉన్నాం’ అంటూ సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, నెటిజన్లు.. ఇలా అందరూ మద్దతు తెలుపుతున్నారు.
Also Read- Sreeja Marriage: శ్రీజకు చిరంజీవి అందుకే మూడో పెళ్లి చేయలేదా?
సినిమా ఇండస్ట్రీల నుంచి రజినీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ లాల్, మమ్ముట్టి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, విజయ్ దేవరకొండ వంటి వారంతా సోషల్ మీడియా వేదికగా మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తోంది.. జైహింద్ అంటూ ‘ఆపరేషన్ సింధూర్’పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ బాలీవుడ్ నుంచి మాత్రం ప్రముఖంగా చెప్పుకునే ఖాన్ లెవరూ ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం, అక్కడి ప్రేక్షకులకే కాకుండా, వారి అభిమానులకు సైతం కోపం తెప్పిస్తోంది. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ ఖాన్ (Salman Khan), ఆమిర్ ఖాన్ (Aamir Khan) వంటి వారు అసలు ఈ ఆపరేషన్‌పై ఇంత వరకు స్పందించకపోవడం చూసిన వారంతా, వాళ్లు మన దేశంలో అవసరమా? అనేలా కామెంట్స్ చేస్తుండటం విశేషం.
వాస్తవానికి ఆమిర్ ఖాన్ సోషల్ మీడియా నుంచి వైదొలగి చాలా కాలం అవుతుంది. ఆయన గతంలో భారత్ గురించి ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. అసలు ఈ దేశం వదిలి వెళ్లిపోవాలనుందనేలా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ అక్కడక్కడా వినబడుతూనే ఉంటాయి. మరి అలాంటి వ్యక్తి, ఇప్పుడు స్పందిస్తాడని ఎలా అనుకుంటాం. ఇక షారుఖ్, సల్మాన్‌ల విషయానికి వస్తే.. బాలీవుడ్‌లో వీరికి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అందరికీ తెలిసిందే. కానీ, వీరు కూడా కూడా ఈ ఆపరేషన్‌పై స్పందించకపోవడంతో అందరికీ అనుమానాలు వస్తున్నాయి. అంటే, వారికి ఈ ఆపరేషన్ సింధూర్ ఇష్టం లేదా? అందుకే స్పందించలేదా? పాకిస్థాన్ అంటే అంత ప్రేమ ఉంటే, అక్కడికే పోయి ఉండొచ్చు కదా.. అంటూ కొందరు నెటిజన్లు చాలా అగ్రెసివ్‌గా రియాక్ట్ అవుతున్నారు.
Also Read- Sree Vishnu: ‘శ్వాగ్’ రిజల్ట్‌పై హీరో శ్రీ విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
కాకపోతే వీరిద్దరూ పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన రోజున, ఎక్స్ వేదికగా రియాక్ట్ అవుతూ దాడిని ఖండించారు. కానీ, భారత్ సైన్యానికి, భారత్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండాల్సిన టైమ్‌లో వారి సైలెన్స్‌ని అభిమానులు కూడా సహించలేకపోతున్నారు. బుద్ది చూపించారు అంటూ, అభిమానులే రియాక్ట్ అవుతుండటం మాత్రం ఇక్కడ హైలెట్. చూద్దాం.. వీరి పరిస్థితి బాలీవుడ్‌లో ముందు ముందు ఎలా ఉంటుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు