Sree Vishnu: శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘సింగిల్’ (Single). ఈ మధ్య ‘మంచు’ కాంట్రవర్సీతో ఈ సినిమా బాగానే వార్తలలో నిలుస్తుంది. అలాగే చిత్ర ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై భారీగానే అంచనాలను పెంచేసింది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా, వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించిన చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. మే 9న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ చిత్ర విశేషాలను హీరో శ్రీవిష్ణు మీడియాకు తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘మే 9న ‘సింగిల్’ సినిమా థియేటర్లలోకి వస్తుంది. మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుల్ని నవ్వించాలనే ఉద్దేశంతో తీసిన సినిమానే ఇది. కథ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా ఉంటాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇంటర్వెల్, క్లైమాక్స్ కొత్తగా, ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. యువతకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా సినిమా చూడొచ్చు. ఆడియన్స్ ఈ సినిమా చూసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. గీతా ఆర్ట్స్‌లో బ్యానర్‌లో చేయాలని అందరికీ ఉంటుంది. నేను ఎప్పటినుంచో ఈ బ్యానర్‌లో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటున్నాను. లక్కీగా ఈ సినిమాతో నా కోరిక తీరింది.
Also Read- Happy Days Meme: దువ్వాడ, అఘోరి, అన్వేష్, బెట్టింగ్ బ్యాచ్.. ‘హ్యాపీ డేస్’ మీమ్‌తో అల్లరల్లరి!
డైరెక్టర్ కార్తీక్ రాజుతో నాకు టూ ఇయర్స్ ట్రావెల్ ఉంది. చాలా మంచి టీమ్‌తో కలిసి సినిమా చేశాం. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఇదంతా టీమ్ ఎఫర్ట్ అని భావిస్తున్నాను. కార్తీక్ రాజు ఈ కథ చెప్పినప్పుడు చాలా మంచి ఎంటర్టైనర్ అవుతుందని నమ్మకం కలిగింది. ఫైనల్‌గా సినిమా చూశాక చాలా పెద్ద ఎంటర్టైనర్ అవుతుందని అనిపించింది. ఇందులో క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది. అందరికీ నచ్చుతుంది. నా క్యారెక్టర్, వెన్నెల కిషోర్ క్యారెక్టర్, అలాగే ఇద్దరు హీరోయిన్స్ క్యారెక్టర్స్‌ని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ చాలా యూనిక్‌గా ఉంటుంది. ఈ సినిమాను కంప్లీట్‌గా హైదరాబాద్‌లోనే తీశాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్ ని ఇంత కొత్తగా ఎవరు చూపించలేదని చెప్పగలను.
ఇందులో నా పాత్రకానీ, వెన్నెల కిషోర్ పాత్రకానీ లేకపోతే ఈ సినిమానే లేదు. సినిమా చూసిన తర్వాత అది అందరికీ అర్థమవుతుంది. నా డైలాగ్ డిక్షన్ గురించి అంతా మాట్లాడుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వారి కోసం నేను సెపరేట్‌గా కేర్ తీసుకుంటున్నాను. షూటింగ్ అంతా చాలా కంఫర్టబుల్‌గా జరిగింది. గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో నా నుంచి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఆడియన్స్ చూస్తారు. నేను ఇండస్ట్రీకి వచ్చి పదహారేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ప్రేక్షకులకు బోర్ కొట్టించని సినిమాలే చేశానని భావిస్తున్నాను. రానున్న రోజులలో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ రాబోతున్నారు. ఆ మార్పుకి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రతి క్యారెక్టర్‌లో ది బెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను.
Also Read- Operation Sindoor: సహనం.. సహనం ఎంతకాలం? మహా సేనా మీ వెన్నంటే మేము!
‘సామజవరగమన, ఓం భీమ్ బుష్’ తర్వాత నేను చేసిన ‘శ్వాగ్’ (Swag Movie) అంతా ఫుల్ కామెడీ సినిమా అనుకున్నారు. మేము కూడా ప్రాపర్ కంటెంట్ ఇలా ఉంటుందని ప్రిపేర్ చేయలేకపోయాం. అందుకే చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడిందని భావిస్తున్నాను. ఫుల్ ఫన్ అని వచ్చిన వాళ్ళు కొంత డిజప్పాయింట్ అయిన మాట నిజమే. ఒక డిఫరెంట్ కంటెంట్ సినిమా చూడాలనే ఆడియన్స్‌కి సినిమా చాలా నచ్చింది. టీవీలో టెలికాస్ట్ అయిన తర్వాత ఈ సినిమాలో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులకి అర్థమైంది. ప్రయోగం చేసినప్పుడు వర్క్ కాకపోతే దానిని అనుభవం కింద చూడాలి. వర్క్ అయినా వర్క్ కాకపోయినా కొత్త ప్రయత్నం మానకూడదని నా అభిప్రాయం. ‘సింగిల్’ తర్వాత ‘మృత్యుంజయ’ అనే థ్రిల్లర్ చేస్తున్నాను. అలాగే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం చేస్తున్నాను. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో మరో సినిమాకు కూడా సైన్ చేశాను’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు