Happy Days Meme
ఎంటర్‌టైన్మెంట్

Happy Days Meme: దువ్వాడ, అఘోరి, అన్వేష్, బెట్టింగ్ బ్యాచ్.. ‘హ్యాపీ డేస్’ మీమ్‌తో అల్లరల్లరి!

Happy Days Meme: ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న బ్యాచ్ అందరూ ఒక చోటకి చేరితే, వారితో ఒక మీమ్ చేస్తే ఎలా ఉంటుంది. అదే చేశాడు ఓ నెటిజన్. ఇన్‌స్టాగ్రమ్‌లో ‘ఎవుర్రా మీరంతా’ పేరుతో ఉన్న అకౌంట్‌లో పోస్ట్ అయిన వీడియో ఒకటి సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా.. ఏమన్నా టాలెంట్రా బాబు? అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? ఎవరెవరితో మీమ్ చేశారనే విషయంలోకి వస్తే..

Also Read- shrasti verma: నన్ను కొట్టారు.. తప్పుగా ప్రవర్తించారు.. జానీ మాస్టర్ పై సంచలన కామెంట్స్ చేసిన శ్రేష్టి వర్మ

ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల హవా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లదే రాజ్యం అన్నట్లుగా మారిపోయాయి. ఒక్కొక్కడు ఒక్కోలా బిహేవ్ చేస్తూ, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టి వస్తామంటూ టూర్లు కూడా బాగానే వేస్తున్నారు. ఇంకా బిగ్ బాస్ తెలుగు బ్యాచ్. ఇలా ఒక్కరేమిటి? ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వారందరినీ తీసుకుని, ‘హ్యాపీడేస్’ (Happy Days) సినిమాలోని థీమ్‌తో ఒక మీమ్ వీడియోని వదిలారు. ఆఖరికి ఇందులో ఈ మధ్య వార్తలలో నిలిచిన అఘోరిని కూడా వదల్లేదు.

">

హ్యాపీ డేస్‌లో టైసన్ పాత్ర చేసే ప్రయోగంతో ఆకాశంలో వారి లవర్స్ ఇమేజ్‌‌లు కనిపించే సీన్‌ని ఇక్కడ నిత్యం వార్తలలో ఉంటున్న వారందరి ఫేస్‌లు పెట్టి, కింద భూమ్మీద వారి లవర్స్ ప్రయోగం చేస్తున్నట్లుగా భలే మ్యాచ్ చేశారు. ఇందులో ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కేసుల్లో చిక్కుకున్న వారు, దువ్వాడ శ్రీనివాస్ (Duvvada Srinivas), ఆయన ప్రియురాలు దివ్వెల మాధురి (divvala madhuri), అఘోరి, నా అన్వేష్, వర్షిణి, శ్రీముఖి.. ఇలాంటి అందరి ఫేస్‌లతో చేసిన ప్రయోగం బాగానే వర్కవుట్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోకు కామెంట్స్ కూడా బాగానే పడుతున్నాయి.

Also Read- Operation Sindoor: సహనం.. సహనం ఎంతకాలం? మహా సేనా మీ వెన్నంటే మేము!

అసలు ఎలారా ఇలా? ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు? పనికిమాలిన బ్యాచ్ అందరినీ భలే పట్టేశారుగా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ‘హ్యాపీ డేస్’ విషయానికి వస్తే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, వంశీ, రాహుల్ హరిదాస్, సోనియా వంటి వారంతా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్‌ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా గురించి అప్పుడప్పుడు ఇండస్ట్రీలో టాక్ నడుస్తూనే ఉంటుంది. ఇండస్ట్రీకి ఎంతోమంది నటీనటులను ఈ సినిమా ఇచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్