shrasti verma: తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఓ లేడీ కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించాడంటూ జానీపై ఆరోపణలు చేయడంతో పాటు కేసు కూడా పెట్టింది. అంతే కాకుండా, ఆమె ధైర్యంగా మీడియా ముందుకొచ్చి అసలు జానీపై కేసు పెట్టిందో వివరించింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Sandhya Sridhar: సంధ్య శ్రీధర్ మామూలోడు కాదు.. హైడ్రా దూకుడుతో బయటకొస్తున్న బాధితులు!
శ్రేష్టి వర్మ మాట్లాడుతూ ” ఆ టైమ్ లో నా బాధ ఎవరికి చెప్పుకోవాలి. నా దగ్గర ఉన్నది రెండే దారులు. ఒకటి వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం.. లేదా జరిగింది జరిగినట్టు మీడియా ముందొకొచ్చి ధైర్యం చెప్పడం.. వాటిలో నేను ఇది ఎంచుకున్నాను. గురువు ఎక్కడైనా తన శిష్యులు ఎదుగుతుంటే సంతోషించాలి కానీ, ఇక్కడ మాత్రం వేరుగా జరిగింది. మనమే సినిమా చేసినప్పుడు నాతో స్నేహంగానే ఉన్నారు. కానీ, పుష్ప చిత్రం చేసేటప్పుడు నన్ను అనరాని మాటలన్నీ అన్నారు. జానీ మాస్టర్ భార్య అయితే కొట్టింది. స్టూడియో వద్దకు వచ్చి రచ్చ చేశారు. వారిద్దరూ నా లైఫ్ ను నాశనం చేశారు ” అంటూ ఎమోషనల్ అవుతూ ఆమె మాటల్లో చెప్పుకొచ్చింది.
Also Read: Mulugu Corruption case: ములుగు జడ్పీ కార్యాలయంలో ఏసీబీ దాడులు.. అధికారులు పట్టుబడిన రహస్యాలు!
శ్రేష్టి వర్మ పై కేసు
రెండు రోజుల క్రితం శ్రేష్టి వర్మ పై కొందరు కేసు నమోదు చేశారు. దీనికి సంబందించిన వార్తా కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. స్వాతంత్ర సమరయోధులను గౌరవించకుండా, హేళన చేస్తూ ఇలా ఎలా మాట్లాడుతుంది. హద్దులు దాటి ఇలా మాట్లాడిన సినీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ పై కఠిన చర్యలు తీసుకొని తక్షణమే FIR నమోదు చేయాలని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు.