CM Revanth on KCR (imagecredit:twitter)
Politics

CM Revanth on KCR: కేసీఆర్ గుండె ఆనాడే పగిలింది.. రేవంత్ రెడ్డి

తెలంగాణ: CM Revanth on KCR: తాను సీఎం అయిన రోజే కేసీఆర్ గుండె పగి లిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. పదేళ్ల పాలన, 15 నెలల డెవలప్ మెంట్ పై కేసీఆర్ చర్చకు రావాలన్నారు. స్వయంగా ఆయనే అసెంబ్లీకి రావాలన్నారు. ఆయన పంపిన పిల్లలు అసెంబ్లీలో ఏం చేస్తారని? విమర్శించారు. ఏదీ ఉన్న తాను కేసీఆర్ తోనే తేల్చుకుంటానని సీఎం స్పష్టం చేశారు. రాహుల్ గాంధీతో తనకు మంచి రిలేషన్ ఉన్నదన్నారు.

ఎలాంటి గ్యాప్ లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రపంచంలో ఇందిరా గాంధీని మించిన యోధురాలు లేదని, గాంధీ కుటుంబం మొత్తం దేశానికి అంకితమయ్యారన్నారు. ఇది దేశ ప్రజలకు గొప్ప వరమన్నారు. కేసీఆర్, మోడీ లు వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారన్నారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ తన అక్కసు, ఆవేదనను కక్కాడన్నారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీమ్ లు ఏం రాష్ట్రంలోనూ లేవన్నారు. ఏడాదిన్నర నుంచి స్కీమ్ లు గ్రౌండ్ చేస్తూనే ఉన్నామన్నారు. వాటన్నింటినీ క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా అందజేసేందుకు ప్రత్యేక వ్యవస్థను తీసుకురాబోతున్నామన్నారు. కగార్ అంశం పై జాతీయ స్థాయిలో చర్చ జరగాలన్నారు. ఈ అంశంపై పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు.

Also Read: Mahesh Kumar on KCR: కేసీఆర్.. దమ్ముందా? ఛాలెంజ్ అంటూ టీపీసీసీ చీఫ్ సవాల్!

తాను ఇంకా 20 ఏళ్లు రాజకీయాల్లో ఉంటానని, చట్ట ప్రకారమే ముందుకు సాగుతానని వెల్లడించారు. కేసీఆర్ ఫ్యామిలీని అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తుందని , కానీ చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తాను కమిట్‌మెంట్ ఇస్తే కచ్చితంగా తీరుస్తానని వెల్లడించారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇప్పిస్తానని ప్రకటించానని, చెప్పినట్లే వచ్చిందన్నారు.

తమ ప్రభుత్వం పనులు చేస్తున్నప్పటికీ, చెప్పుకోవడంలో వెనకబడ్డామన్నారు. స్పీడప్ చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇందుకు పార్టీ, ప్రభుత్వం సమన్వయ మీటింగ్ ను కూడా ఏర్పాటు చేస్తుందన్నారు. మరోవైపు ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశామన్నారు.

ఆప్షన్ లేకనే కొంత మంది అధికారులను కీలక శాఖల్లో కొనసాగిస్తున్నామన్నారు. త్వరలో వాళ్లకీ చెక్ పడుతుందని సీఎం వివరించారు. ప్రజలకు మేలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేయదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.బీఆర్ ఎస్ తరహాలో తప్పుల తడకలతో ప్రభుత్వాన్ని నడిపించమన్నారు. పారదర్శకమైన పాలన అందించి దేశంలోనే తెలంగాణను ఉన్నతిగా నిలపెట్టాలనేది తమ లక్ష్యం అన్నారు.

Also Read: Silver Jubilee Celebrations: సిల్వర్ జూబ్లీ వేడుకలు.. కానరాని పెద్ద సార్!

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది