Silver Jubilee Celebrations: బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఉమ్మడి వరంగల్ లోని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. 25 సంవత్సరాల బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రస్తావని వివరిస్తూనే వేడుకలు నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలకు ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వలేదు.
కనీసం వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడ జయశంకర్ సార్ ఫోటో కనిపించలేదు. కనీసం స్టేజ్ పైన కూడా కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు తప్ప జయశంకర్ సార్, తెలంగాణ అమరవీరుల ఫోటోలు ఒక్కటి కూడా కనిపించకపోవడం తెలంగాణ ఉద్యమకారులను నిరాశ గురిచేసింది.
సిల్వర్ జూబ్లీ సభ ప్రధాన స్టేజీపై కేవలం కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. పార్టీ ముఖ్య నేతలు పార్టీ ఆవిర్భావంలో పనిచేసిన నేతల ఫోటోలు కూడా ఎక్కడ కనిపించలేదు. సభ ఆవరణలో ఏర్పాటు చేసిన హోర్డింగ్ లు, ఫ్లెక్సీలలో కనిపించని హరీష్ రావుకు ప్రాధాన్యత కరువైంది.
Also read: Kaleshwaram project: ఒక్క ప్రసంగం.. 100 ప్రశ్నలు.. కేసీఆర్ కు కొత్త చిక్కులు!
ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకొని టీఆర్ఎస్ నేతలు ప్రతి కార్యక్రమంలో బతుకమ్మలకు బోనాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈ వేడుకల్లో బతుకమ్మ, బోనాలకు ఆదరణ లేకుండా పోతుందనే చర్చ సాగింది. సభకోసం తెచ్చిన మజ్జిగ ప్యాకెట్లను విసిరేస్తూ అల్లరి చేసిన కార్యకర్తలు కేసీఆర్ ప్రసంగం కు సైతం పలుమార్లు అడ్డు తగిలి కేసీఆర్ కోపానికి కారణం అయ్యారు.
సభ వేదిక దగ్గర ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్ద BRS కార్యకర్తల హంగామాతో మీడియా ప్రతినిధులకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ఉద్యమ సమయంలో మొదటిసారి రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయంలో తెలంగాణ సెంటిమెంటును తెలంగాణ సంస్కృతిని తెలంగాణ ఉద్యమకారులను వాడుకున్న కేసీఆర్ ఇప్పుడు అన్ని తామే (కేసీఆర్, కేటీఆర్) అనే అనే రీతిలో ఫ్లెక్సీలు, కటౌట్లు స్టేజి పై ఫోటోలు అమర్చిన తీరు కనిపించింది.