CM Revanth Reddy: కేసీఆర్ తెచ్చిన చట్టంతో బీసీలకు అన్యాయం
CM Revanth Reddy (imagecredit:swetcha)
Political News

CM Revanth Reddy: కేసీఆర్ తెచ్చిన చట్టంతో బీసీలకు అన్యాయం.. దీంతో నష్టం?

CM Revanth Reddy: బీసీలకు మేలు జరగాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్ లో పీఏసీ(PACC) మీటింగ్ లో మాట్లాడుతూ..90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పై సుప్రీం కోర్టు లో తెలంగాణ రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను ప్రత్యేకంగా నియమించామన్నారు. కేసీఆర్(KCR) తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తీసుకువచ్చి దాన్ని గవర్నర్ కు పంపగా, అక్కడ్నుంచి కేంద్రానికి పంపారని సీఎం వెల్లడించారు. రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట నిలపెట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందన్నారు.

అసెంబ్లీలో బిల్ పాస్

కేసీఆర్(KCR) తెచ్చిన చట్టం ప్రకారం బీసీ(BC) లకు ఒక్క శాతం రిజర్వేషన్ కూడా రాదని సీఎం నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రం లో కులగణన చేపట్టామన్నారు. బీసీ లకు విద్యా,ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గం లో ఆమోదించి అసెంబ్లీ లో బిల్ పాస్ చేసుకున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నిక(Local Body Elections)ల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తీసుకురాగా, ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చామన్నారు. ఇవి పెండింగ్ లో ఉన్నాయన్నారు.

Also Read: Kaleshwaram project: కాళేశ్వరం’ పిటిషన్లపై హైకోర్టు గరం గరం వాదనలు

యూరియా కొరత పైన డ్రామాలు

ఇక బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్ర కు ఈ నెల 26 న తాను వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఉప రాష్ట్ర పతి అభ్యర్థ గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి(Sudharsha Reddy) ని ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రకటించి నందుకు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge), సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi) కి ధన్యవాదాలు తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం,పౌర హక్కుల ను కాపాడటం కోసం పని చేశారన్నారు. మరోవైపు బీఆర్ ఎస్(BRS) ,బీజేపీ(BJP) కలిసి యూరియా కొరత పైన డ్రామాలు ఆడుతున్నాయన్నారు. యూరియా ఇచ్చే పార్టీ కే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తానని కేటిఆర్(KTR) అనడంలోనే వాళ్ల తీరు అర్థం అవుతుందన్నారు. యూరియా కోసం నాలుగు సార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా(JP Nadda), అనుప్రియా పటేల్(Anu Priya Patel)ను కలిశామన్నారు. యూరియా పంపిణీ పైన శేత్రస్థాయిలో మానిటరింగ్ ను పెంచాలన్నారు.

Also Read: BCCI on Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌పై అధికారిక ప్రకటన చేసిన బీసీసీఐ!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క