cases filed against leaders as election code violation in telangana పోలింగ్ రోజున.. కీలక నేతలపై ఫిర్యాదులు, కేసులు
Mlc Elections
Political News

Polling: పోలింగ్ రోజున.. కీలక నేతలపై ఫిర్యాదులు, కేసులు

Election: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు జరుగుతుండగా పలువురు కీలక నాయకులపై కేసులు నమోదయ్యాయి. ఒక వైపు పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు ఫిర్యాదుల పర్వం కొనసాగింది. బీజేపీ నాయకులు రాజాసింగ్, మాధవీలతపై కేసులు నమోదయ్యాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి.

రాజాసింగ్:

మంగళ్‌‌హాట్ పరిధిలోని ఎస్ఎస్‌కే జూనియర్ కళాశాలలో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎమ్మెల్యే రాజా సింగ్ వెళ్లారు. అక్కడ ఓటు వేస్తుండగా ఎన్నికల అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల స్క్వాడ్ మంగళ్‌హాట్ పోలీసు స్టేషన్‌లో రాజా సింగ్ పై ఫిర్యాదు చేశారు. ఎన్నికల స్క్వాడ్ ఫిర్యాదుపై కేసు నమోదైంది.

మాధవీలత:

హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత పాతబస్తీలో హల్‌చల్ చేశారు. మలక్‌పేట్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడానికి క్యూలో ఉన్నప్పుడు అక్కడికి మాధవీలత వచ్చారు. పోలింగ్ సరళిని తెలుసుకోవడానికి వచ్చిన ఆమె అక్కడ బుర్ఖా వేసుకుని ఉన్న మహిళల నుంచి ఐడీ కార్డులు తీసుకుని పరిశీలించారు. బుర్ఖా తొలగించి చూస్తూ అనుమానంతో తదేకంగా పరిశీలించారు. ఓటర్ కార్డు, ఓటర్ స్లిప్‌లను మళ్లీ మళ్లీ చూస్తూ నకిలీ ఓటర్లా అన్నట్టుగా పరిశీలించారు. వివరాలు అన్ని సరిగ్గా పరిశీలించిన తర్వాతే ఓటు వేయడానికి అనుమతించాలని పోలింగ్ సిబ్బందిని ఆమె కోరారు. ఆమె బుర్ఖా తొలగించి ముఖాలు చూస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ స్పందించి ముస్లిం మహిళలను ఇబ్బంది పెట్టిన కొంపెల్లి మాధవీలతపై కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

Also Read: ఒక్క ఓటుతో తారుమారు

కిషన్ రెడ్డి, కేటీఆర్‌:

ఓటు వేసిన అనంతరం సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ పేరు ప్రస్తావించారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కిషన్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరింది. కేటీఆర్‌పైనా కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేయాలని కోరింది.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..