Srinivas Goud on Congress: బీసీల్లో ఏ కులానికి ఇచ్చిన హామీలను కూడా ఇప్పటివరకు కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అమలు చేయలేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivass Goud) ఆరోపించారు. బీసీ(BC)లంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్క లేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవో లతో అయ్యే పనులు కూడా రేవంత్(Revanth) ప్రభుత్వం చేయడం లేదన్నారు. 21 నెలల కాంగ్రెస్ పాలనలో గీత కార్మికులు చాలా మంది ప్రమాదశావత్తు మరణించారని, 12కోట్లు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాల్సి ఉన్నా చెల్లించడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ నిర్మించిన భవనాలను ప్రారంభించే తీరిక కూడా ఈ ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు.
25 శాతం రిజర్వేషన్లు
గౌడలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని మండిపడ్డారు. వైన్స్ షాపు(Winews Shop)ల్లో గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారని, 15 శాతానికి పరిమితం చేశారని ఆరోపించారు. కొత్త మద్యం షాపులకు 14న జీవో విడుదల చేస్తే ఈ నెల 20న బయటకు వచ్చిందన్నారు. గౌడ లకు మద్యం షాపుల్లో ఇస్తామన్న 25 శాతం రిజర్వేషన్లు జీవో లో ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. తక్షణమే జీవో(GO) ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ లకు మద్యం షాపులు కేటాయించాలని, కల్తీ కల్లు పేరిట కల్లు దుకాణాల పై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. గౌడ లకు వైన్ షాపుల్లో రిజర్వేషన్లు 25 శాతం పెంచేదాకా ఉద్యమిస్తామన్నారు.
Also Read; Ganesh Immersion Process: గణేష్ నిమజ్జనంపై బల్దియా ఫోకస్.. భారీగా ఏర్పాట్లు
పై మాట తప్పినట్టే
కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ సమాజాన్ని కాంగ్రెస్(Congres) నయవంచన చేస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే మోసం ,వంచనేనా ? అని నిలదీశారు. బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె .కిషోర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ అమలు లో దారుణంగా విఫలమైందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పై మాట తప్పినట్టే మద్యం షాపుల్లో రిజర్వేషన్ల పెంపు పై మాట తప్పారన్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి తీరుతామని, జీవో 93 రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బీ ఆర్ ఎస్ నేత నాగేందర్ గౌడ్ మాట్లాడుతూ జీవో 93 రద్దయ్యేదాకా ఉద్యమిస్తామని హెచ్చరించారు.