BRS MLAs In TG Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. కానీ దాని గుర్తులు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అది కూడా ముస్తఫ్ఫా ముస్తఫ్ఫా.. అనే పాట బీజీఎం వేసి మరీ వైరల్ చేస్తున్నారు. అంతేకాదు అసెంబ్లీ సమావేశాల సంధర్భంగా జరిగిన కొన్ని దృశ్యాలు జోడించి, బీఆర్ఎస్ పై నెటిజన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు బడ్జెట్ సమావేశాలేంటి? వీడియోలు ఏంటి? బీఆర్ఎస్ పై విమర్శలేంటి అనే డౌట్ వచ్చిందా? అయితే ఈ కథనం తప్పక చదవండి.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 12 నుండి 27 వ తేదీ వరకు నిర్వహించారు. ఆ తర్వాత అసెంబ్లీ నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. 11 రోజుల పాటు జరిగిన శాసనసభ సమావేశాలు.. 97 గంటల 32 నిమిషాల పాటు సాగాయి. 3 తీర్మానాలను ఆమోదించిన తెలంగాణ శాసనసభ, మరో 12 బిల్లులను ఆమోదించింది. అయితే బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజు జరిగిన సభ మాత్రం హైలెట్ గా నిలిచింది. నేటికీ సభ ముగిసి రెండు రోజులైనప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే 11 రోజులు అసెంబ్లీ సాగగా, ఆ సమయంలో జరిగిన కొన్ని అరుదైన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్స్, కాంగ్రెస్ లీడర్స్ వాటిని పోస్ట్ చేస్తూ.. ఇది ప్రజా ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ సర్కార్ తీరు గురించి విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. ఇంతకు ఆ అరుదైన దృశ్యాలు ఏమిటంటే.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య సభ జరిగినంత సేపు మాటల యుద్ధం సాగేది.
సభ అలా ముగియగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా మంత్రుల వద్దకు వెళ్ళి తమ నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడం, అలాగే మాటామంతీ కలపడం ఇలాంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు సభ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన వద్దకు వచ్చిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు తాను సమయం కేటాయించి సహకరించినట్లు చెప్పుకొచ్చారు. ఇది ఇందిరమ్మ రాజ్యం.. ఇక్కడ కేవలం ఎన్నికల వరకే పార్టీలు, ఆ తర్వాత రాష్ట్రం ముఖ్యమంటూ సీఎం చెప్పుకొచ్చారు.
అలా పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలతో మంత్రులు మాట్లాడిన వీడియోలు కట్ కట్ లుగా తెగ వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంత్రులు మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం మంచి శుభపరిణామం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా సభలో మంత్రుల వద్దకు వెళ్లి మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి. అంతవరకు ఓకే గానీ ఇక్కడే కాంగ్రెస్ లీడర్స్ ఓ మాట లేవనెత్తుతున్నారు.
Also Read: Madhavi Latha : నా అన్వేష్ నోరు జాగ్రత్త .. నీ వల్లే తల నొప్పి..?
గత పదేళ్లలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏనాడైనా ఇలా మాట్లాడే అవకాశం ఇచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో మాత్రం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుతం అందుకు భిన్నంగా సీఎం రేవంత్ సర్కార్ ప్రవర్తిస్తుందని నెటిజన్స్ అంటున్నారు. రాష్ట్రం ముఖ్యం, అభివృద్ధి ప్రధానం.. అంతేకానీ సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు వారిని దూరం పెట్టే ఆలోచన లేదని కాంగ్రెస్ అంటోంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వంలో మార్పు రావాలని, అధికారంలో ఉన్నా లేకున్నా ఒకే తీరులో వ్యవహరించాలని నెటిజన్స్ కోరుతున్నారు.
https://www.facebook.com/share/r/19NoaBNKTQ/