MLA Vijayudu: ప్రజాపాలన కాదు.. రాష్ట్రంలో ప్రజలను పీడించే పాలన జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు (MLA Vijayudu) అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. నేషనల్ హైవే 44 పనులు జరుగుతున్నాయని 8 కోట్లు ఇస్తేనే పనులు సాగనిస్తానని మాజీ ఎమ్మెల్యే సంపత్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మండల స్థాయి అధికారులను సైతం నిత్యం భయపెట్టి వసూలు చేస్తున్నాడని మండిపడ్డారు. నడిగడ్డ నీ రాజ్యం కాదు ప్రజలది అని పేర్కొన్నారు. వసూల్ రాజా పై అన్ని ఆధారాలు ఉన్నాయని త్వరలోనే బయటపెడతానని వెల్లడించారు.
Also Read:Minister Ponguleti Srinivas: 18న పాలేరుకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..!
ఆ మాజీ ఎమ్మెల్యే సీటు వేసి విచారణ వేస్తారా
కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృష్ణ మాట్లాడుతూ.. జర్నలిస్టులపై సిట్ వేసిన ప్రభుత్వం.. మాజీ ఎమ్మెల్యే సంపత్ పై కూడా సీటు వేసి విచారణ వేస్తారా అని ప్రశ్నించారు. మారనా ఆయుధాలతో బెదిరించారని భ్రమర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ కూడా ఫిర్యాదు చేసిందని అన్నారు. సంపతి ఎప్పుడు మాత్రం అసైన్డ్ ల్యాండ్ రెండు ఎకరాలు ఆయన సతీమణి పేరు పై రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. ఇతను ఎమ్మెల్యే కాదు.. మంత్రి కాదు ఎందుకు ఇతనికి.. ఉద్యోగులు ఉద్యోగుల లిస్టు పంపాలని ప్రశ్నించారు.

