BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫండ్ కావాలి
BRS Party ( image credit: swetcha reporter)
Political News

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫండ్ కావాల్సిందే.. నేతల మాటలకు అధిష్టానం షాక్?

BRS Party: పార్టీ అధిష్టానానికి గులాబీ లీడర్లు షాక్ ఇస్తున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తాం కానీ పార్టీ ఫండ్ ఇవ్వాలని ప్రపోజల్ పెడుతున్నారు. పార్టీ ఫండింగ్ ఇస్తేనే గెలిచే అవకాశం ఉంటుందని, తమ దగ్గర ఉంది సరిపోదని ఉమ్మడి జిల్లా సమావేశాల్లో నేతలు పేర్కొంటున్నారు. సత్తా చాటాలంటే ప్రభుత్వ వైఫల్యాలు ఒకటే సరిపోదని, కాంగ్రెస్‌కు దీటుగా వెళ్లాలంటే ఓటర్లకు పంచాల్సిన పరిస్థితి ఉందని పేర్కొంటున్నట్లు సమాచారం. లేకుంటే విజయం సాధించలేమని తేల్చి చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. దీంతో ప్రధాన ప్రతిపక్షం గులాబీ పార్టీ ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నేతల సమావేశం నిర్వహిస్తుంది. అయితే, అధిష్టానం ముందు నేతలు మాత్రం డిమాండ్లు పెడుతున్నారు. గతానికి భిన్నంగా ఎన్నికల ఖర్చులు ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి ప్రపోజల్ పెడుతున్నట్లు సమాచారం.

పట్టును నిలుపుకోవాలని

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని ఇప్పటి నుంచే ప్లాన్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అప్పుడున్న 135 మున్సిపాలిటీలో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సత్తా చాటడంతో గతంలో ఉన్న పట్టును నిలుపుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే వరుసగా ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశాలను నిర్వహిస్తోంది.

రంగంలోకి కేటీఆర్, హరీశ్

మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ విజయం కోసం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లాల ముఖ్య నేతలతో మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్‌తో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ అధిష్టానం ముందు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు డిమాండ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖర్చును మేమే పెట్టుకున్నామని ఇక త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల ఖర్చు భరించడం మా వల్ల కాదని గులాబీ అధిష్టానం చూసుకోవాలని చెప్పినట్లుగా చర్చ నడుస్తోంది. దీంతో విషయాన్ని అధినేత దృష్టికి తీసుకువెళ్లి ఖర్చు విషయంలో క్లారిటీ ఇస్తామని అగ్రనేతలు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Also Read: BRS Party: గ్రామాల్లో పట్టు సడలకుండా గులాబీ నేతల విశ్వ ప్రయత్నాలు.. క్యాడర్ ఆ పార్టీ చేతికి చిక్కకుండా ప్లాన్!

ఎన్నికల ఖర్చులు అధిష్టానం చూసుకోవాలి!

అసలే పార్టీ ప్రతిపక్షంలో ఉంది. దీంతో ఖర్చు విషయంలో ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో బీఆర్ఎస్ అధిష్టానం పడినట్లు సమాచారం. ఫండింగ్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పోటీచేసే అభ్యర్థులు చూసుకోవాలని అంటే రిజల్ట్ ఏ విధంగా వస్తుందనే గుబులు పట్టుకుంది. ఇక బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఎన్నికల ఖర్చును అధిష్టానం భరించింది. అసెంబ్లీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధిష్టానం ఫండింగ్ చేసింది. దీంతో ఇప్పుడు తమకు ఎన్నికల ఖర్చులు అధిష్టానం చూసుకోవాలని నేతలు ఓపెన్‌గా కేటీఆర్, హరీశ్ రావు కు చెప్పినట్లు తెలిసింది. మరో వైపు జిల్లాల్లో నేతల మధ్య అంతర్గత విభేదాల పైన చర్చ జరిగినట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయి. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల్లో
అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని కేటీఆర్, హరీశ్ రావులు నేతలకు సూచిస్తున్నారు. ప్రచారం
విషయం తర్వాత చూసుకోవచ్చని.. తొలుత ఖర్చు విషయంలో క్లారిటీ ఇవ్వాలని నేతలు అధిష్టానం పెద్దలను కోరినట్లు సమాచారం.

విజయం సాధిస్తేనే పార్టీలో జోష్

పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో గులాబీ అధిష్టానం నేరుగా ఎమ్మెల్యేలకు, ఇన్‌ఛార్జ్‌లకు అన్ని ఎన్నికల్లో ఆర్థిక సహకారం అందించింది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఫండింగ్ చేయాలని నేతలు అధిష్టానం దృష్టికి తేవడంతో అలవాటు చేశారు. కాబట్టి తప్పుతుందా అనే అభిప్రాయం గులాబీ క్యాడర్‌లో వినిపిస్తోంది. పట్టు సాధించాలంటే పార్టీ అధిష్టానం ఫండింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పుర పోరులో విజయం సాధిస్తేనే పార్టీ నేతలు క్యాడర్లో జోష్ నింపినట్లు అవుతుంది. లేకుంటే పార్టీ బలహీన పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ

ఎక్కువ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది. ఉత్తర తెలంగాణలో మాత్రం త్రిముఖ పోటీ ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో ఏ పార్టీ అయితే తమ పార్టీ అభ్యర్థులకు ఫండింగ్ చేస్తున్నదో వారే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో గులాబీ పార్టీ ఫండింగ్ చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. మొత్తానికి గులాబీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ఎలాంటి స్ట్రాటజీని వర్కౌట్ చేస్తుందో చూడాలి.

Also Read: BRS Party: గ్రామాల్లో గులాబీ జోరు.. సర్పంచ్ గెలుపులతో బీఆర్ఎస్ వ్యూహాలకు పదును!

Just In

01

Municipal Elections: మున్సిపాలిటీలకు రిజర్వేషన్ల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!

Telangana Govt: సర్పంచ్‌లకు సమగ్ర శిక్షణ.. ట్రైనింగ్ షెడ్యూల్ ఖరారు చేసిన పంచాయతీ రాజ్ శాఖ!

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫండ్ కావాల్సిందే.. నేతల మాటలకు అధిష్టానం షాక్?

Meenakshi Natarajan: సర్పంచ్ పరిస్థితులు రిపీట్ కావొద్దు.. ముఖ్య నేతలకు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం!

Prisons Department: జైళ్ల శాఖలో ఏం జరుగుతోంది? ఆ ఇద్దరికే ప్రమోషన్.. మిగతా ఇద్దరికి ఎందుకు అన్యాయం?