Harish Rao9 IMAGE CREDIT: TWITTWER)
Politics

Harish Rao: పంచాయతీ కార్యదర్శుల బిల్లులు వెంటనే చెల్లించాలి!

Harish Rao: గ్రామాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా 2019లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం వారు ఎంతో శ్రమించారన్నారు. గ్రామ పంచాయతీలకు సకాలంలో నిధులు మంజూరు చేయడం, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీ అధికారుల కృషి వల్ల తెలంగాణ గ్రామాలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారాయని తెలిపారు.

 Also Read: Damodar Rajanarsimha: దేశ వ్యాప్తంగా క్యాన్సర్ సమస్య.. రోగుల జీవితాలపై తీవ్ర ప్రభావం!

పల్లెలు అంధకారంలో

నిధులు విడుదల లేకపోవడంతో అభివృద్ధి ఎక్కడిక్కడే నిలిచిపోయిందని విమర్శించారు. పారిశుద్ధ్యం పడకేసిందని, వీధి దీపాల నిర్వహణ లేక పల్లెలు అంధకారంలో ఉంటున్నాయని వివరించారు. చివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయించలేక, ఆర్టీఏ ట్యాక్స్ కట్టలేక అధికారులకు తాళాలు అప్పగిస్తున్న దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) నిధులు విడుదల చేయకపోయినప్పటికీ, పంచాయతీ అధికారులు అప్పులు తెచ్చి మరీ నిర్వహణ కొనసాగించే ప్రయత్నం చేశారన్నారు. ఒకవైపు రోజురోజుకీ అప్పులు పెరగడం, మరోవైపు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం వల్ల పంచాయతీ కార్యదర్శులపై ఆర్థిక భారం మరింత పెరిగిందని, దీంతో వారు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

బిల్లులు విడుదల చేయాలి

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తే నిధులు విడుదల మరింత కష్టతరం అవుతుందని బాధపడుతున్నారని చెప్పారు. అదే విధంగా మాజీ సర్పంచులు సైతం చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేసిన పనులకు గాను మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలన్నారు. “అభయహస్తం” మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి (Seethakka) సీతక్కకు హరీశ్ రావు లేఖ రాశారు.

 Also Read: Tollywood: ‘ముందు పెంచుకో.. ఆ తర్వాతే ఛాన్స్’.. స్టార్ హీరో కుమార్తెకు చేదు అనుభవం!

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?